Advertisementt

బిగ్ బాస్ విన్నర్ భార్య ఆవేదన

Fri 04th Jun 2021 09:57 AM
bigg boss season 2 winner,kaushal manda,wife neelima,reality check,covid situation,uk  బిగ్ బాస్ విన్నర్ భార్య ఆవేదన
Bigg Boss Kaushal Manda wife Neelima video viral బిగ్ బాస్ విన్నర్ భార్య ఆవేదన
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో బిగ్ బాస్ మొదలయ్యాక మొదటి సీజన్ లో శివ బాలాజీ విన్నర్ గా నిలవగా రెండో సీజన్ లో కౌశల్ మండా, మూడో సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్ లో అభిజిత్ లు విన్నర్స్ గా నిలిచారు. ఈ నలుగురిలో సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది మాత్రం కౌశల్ మండానే. కౌశల్ ఆర్మీ అంటూ కౌశల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాక, అవ్వకముందు నానా హంగామా చేసాడు. బిగ్ బాస్ విన్నర్ గా అది చేస్తా ఇది చేస్తా అంటూ ప్రగాల్భాలు పలికిన కౌశల్ ప్రస్తుతం సొషల్ మీడియాలో, వీడియోస్ షేర్ చెయ్యడం, ట్వీట్స్ వేసుకోవడం తప్ప మరేదీ చెయ్యడం లేదు. అయితే ఆయన భార్య నీలిమ క్యాన్సర్ తో పోరాడి విజయ సాధించింది అనే విషయం, కౌశల్ మండా కౌశల్ ఆర్మీ నిధులని వాడుకుంటున్నాడనే టాక్ వచ్చిన ఆందర్భలో ఆ భార్య భర్తలు మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టారు.

ఇక ఈమధ్యనే కౌశల్ మండా సోషల్ మీడియాలో నీలిమ నువ్వేదో సాధిద్దామని వెళ్ళావు.. నీకు విజయ్ దక్కాలి అనగానే అందరూ నీలిమ ట్రీట్మెంట్ కోసమే విదేశాలకు వెళ్ళింది అనుకుంటే.. కాదు ఆమె ఉద్యోగం నిమిత్తం యూకే వెళ్లిందట. అయితే యూకే లో కరోనా పేషేంట్స్ ని పట్టించుకోవడం లేదని, అక్కడ పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయంటూ నీలిమ ఓ వీడియో ని షేర్ చెయ్యడమే కాదు.. తనకి కరోనా సోకగా.. నాలుగైదు రోజులకి శ్వాసలో ఇబ్బంది తలెత్తడంతో యూకేలో ఓ హాస్పిటల్ కి వెళ్లగా పేరాసిట్మాల్ ఇచ్చి పంపించారని.. అక్కడ ట్రీట్మెంట్ బాగోలేదు.. భరత్ లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయంటున్నారు కానీ.. ఇండియాలోనే కరోనా ట్రీట్మెంట్ బావుంది అంటూ నీలిమ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తనకి కరోనా తగ్గింది అని త్వరలోనే ఇండియాకి వస్తా అంటూ చెప్పింది.

Bigg Boss Kaushal Manda wife Neelima video viral:

Kaushal Manda Wife Neelima Gives A Reality Check on COVID Situation in UK

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ