ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ అమెజాన్ ప్రైమ్ లో మరికొద్ది గంటల్లో కాదు.. కాదు జస్ట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి పెట్టేసి అందరిని బిగ్ సర్ప్రైజ్ చేసేసారు మేకర్స్. ఈ రోజు రాత్రి 12 గంటలకి ఫ్యామిలీ మాన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వస్తుంది అనుకుంటే.. అంతకు ముందే అంటే జూన్ మూడు రాత్రి తొమ్మిది గంటలకే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ ని అమెజాన్ లో పెట్టేసి ప్రేక్షకులకి సర్ప్రైజ్ ఇచ్చేసారు. ఇప్పటివరకు ఫ్యామిలీ మ్యాన్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూసిన వారు ఇలా కొద్దీ గంటల ముందే ఫ్యామిలీ మ్యాన్ రాక ఖాయమయ్యేసరికి అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు.
ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో తొమ్మిది ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 35 నిమిషాల నుండి 60 నిమిషాల నిడివి ఉన్నాయి. అయితే జస్ట్ హిందీలో మాత్రమే ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ అందుబాటులో ఉంది. తెలుగు, తమిళ్ భషాల్లో ఫ్యామిలీ మ్యాన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. మరి సమంత రాజి గా టెర్రరిస్ట్ గా, మనోజ్ బజ్ పేయి రా ఏజెంట్ గా, ప్రియమణి పెరఫార్మెన్స్, అలాగే రాజ్ డీకే డైరెక్టన్, ఫస్ట్ సీజన్ హిట్ అవడం, సెకండ్ సీజన్ పై ఉన్న హైప్ అన్ని ఫ్యామిలీ మ్యాన్ కోసం ఎదురు చూసేలా చేసాయి. ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ అప్పటినుండి దాని కోసం ఫాన్స్ వెయిటింగ్. ఈ రోజు ఉదయం నుండే ఫ్యామిలీ మ్యాన్ 2 ట్విట్టర్ ఎంటర్టైన్మెంట్ లో ట్రెండ్ అవుతుంది. #TheFamilyMan2, Trending with RAJI STORM బిగిన్స్ అంటూ సమంత ఫాన్స్ ఫ్యామిలీ మ్యాన్ ని ట్రెండ్ చేస్తున్నారు.