ఇప్పుడు ఓటిటి సంస్థలన్నీ ఏ సినిమాని ఎవరు అమ్ముతారు? ఏ సినిమాని కొనేసి ఓటిటిలో రిలీజ్ చేద్దామా? అని వెయిట్ చేసేలా చేసింది కరోనా సెకండ్ వేవ్. అదే గత ఏడాది లాక్ డౌన్ లో చాలామంది థియేటర్స్ కోసం వేచి చూడలేక కొన్ని సినిమాలను ఓటిటికి అమ్మేసారు. కొంతమంది థియేటర్స్ విడుదలయ్యేవరకు ఉంచుకున్నారు. అలా ఉంచినవారిలో సాయి ధరమ్ తేజ్ సోలో బెటర్ సో బ్రతుకే ఒకటి. ఆ సినిమా థియేటర్స్ ఓపెన్ కాగానే 50 పర్సెంట్ అక్యుపెన్సీకి విడుదల చేసింది టీం. సో సో టాక్ వచ్చినా నిర్మాత సేవ్ అయ్యాడు.
అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ మరో కొత్త మూవీ కి ఓటిటి నుండి బాగా ఆఫర్ వెళుతున్నాయట. అది దేవా కట్ట - సాయి తేజ్ కాంబోలో తెరకెక్కిన రిపబ్లిక్. సెకండ్ వెవ్ రాకముందే షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ కి వెళ్ళిపోయి.. రిలీజ్ కి సిద్దమయిన రిపబ్లిక్ సినిమా మీద ఓటిటి కన్ను పడినట్లుగా తెలుస్తుంది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఓటిటి నుండి ఆఫర్స్ వెళుతున్నాయట. మాములుగా అయితే జూన్ 4 న రిపబ్లిక్ కి రిలీజ్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం థియేటర్స్ క్లోజ్ అవడంతో ఈ సినిమాని వాయిదా వేశారు. కానీ ఓటిటి వాళ్ళు మాత్రం రిపబ్లిక్ నిర్మాతల వెంట అపడుతున్నారని అంటున్నారు. మరి ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారో కానీ రిపబ్లిక్ ఓటిటిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ వార్తలొస్తున్నాయి.