Advertisementt

ప్రేమ రెండో పెళ్లి? అందులో నిజమెంత

Thu 03rd Jun 2021 11:36 AM
devi actress,prema,clarifies rumours,second marriage,heroine prema,kannada actress prema  ప్రేమ రెండో పెళ్లి? అందులో నిజమెంత
Actress On Second Marriage ప్రేమ రెండో పెళ్లి? అందులో నిజమెంత
Advertisement
Ads by CJ

సాధారణ ప్రజలైన, సెలెబ్రిటీ అయినా.. పెళ్లి తర్వాత భార్య కానీ భర్త తో కానీ ఇమడలేకపోతే విడాకులు తీసుకోవడం సహజం. సామాన్యుడు అయితే అది న్యూస్ అవదు. కానీ సెలెబ్రిటీ అయితే అదే పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఆ నటి భర్తతో విడిపోయింది. ఆ హీరో భార్యకి వికడాకులిచ్చాడట. ఆ హీరోయిన్ వేరే హీరో హీరోతో లవ్ ఎఫ్ఫైర్ నడుపుతుందిరా అంటూ అనేకరకాలుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది. సెలబ్రిటీస్ ల పెళ్లి తర్వాత విడిపోయి ఒంటరి జీవితాన్ని గడిపేవాళ్లు ఉన్నారు. తర్వాత రెండో పెళ్లి చేసుకుని సెటిల్ అయిన వారు ఉన్నారు. తాజాగా సీనియర్ నటి ప్రేమ రెండో పెళ్లి న్యూస్ గత రెండు రోజులుగా మీడియా లో తెగ వైరల్ గా మారింది.

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌ భాషల్లో హీరోయిన్ గా ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రేమ చాలా ఏళ్లగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే రీసెంట్ గా ప్రేమ ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ ప్రోగ్రాంలో మెరిసింది. మళ్ళీ ఇన్ని రోజులకి ఆమె రెండో పెళ్లి వ్యవహారం తెర మీదకి వచ్చింది. 2006లో వ్యాపార‌వేత్త జీవ‌న్ అప్ప‌చ్చుని పెళ్లి చేసుకున్న ప్రేమ మ‌న‌స్ప‌ర్ధ‌ల‌తో 2016లో విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతున్న ప్రేమ తన రెండో పెళ్లి విషయమే కాదు.. తన హెల్త్ విషయం మీద ప్రేమ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. 

తన రెండో పెళ్లి మేటర్ మాత్రం ఫేక్ అని, తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని తేల్చి చెప్పింది ప్రేమ. అయితేఒకానొక సమయంలో తాను క్యాన్సర్‌తో ఇబ్బంది పడ్డానని, కానీ ఇప్పుడు మాత్రం సేఫ్‌గా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పింది. మరి దీనితో ప్రేమ సెకండ్ మ్యారేజ్ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూద్దాం.

Actress On Second Marriage:

Devi actress Prema clarifies rumours of second marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ