Advertisementt

రామ్ రాయలసీమ స్టోరీ

Thu 03rd Jun 2021 10:14 AM
ram,hero ram pothineny,ram next with lingusamy,lingusamy,faction back drop,rayalaseema back drop  రామ్ రాయలసీమ స్టోరీ
Interesting backdrop for Ram RAPO19 రామ్ రాయలసీమ స్టోరీ
Advertisement
Ads by CJ

రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ భాష మాట్లాడి అదరగొట్టేసాడు. మాస్ గా ఇస్మార్ట్ శంకర్ అంటూ ఆ సినిమాలో రామ్ చేసిన రచ్చ తో యూత్ కి బాగా నచ్చేసాడు. మ్యూజిక్, హీరోయిన్స్ గ్లామర్, పూరి దర్శకత్వం, రామ్ పెరఫార్మెన్స్ అన్ని ఇస్మార్ట్ హిట్ లో హైలెట్ అయ్యాయి. ఆ తర్వాత రామ్ ఎలాంటి మూవీ చూజ్ చేసుకుంటాడో అనుకుంటే.. ఓ రీమేక్ ని సెలెక్ట్ చేసుకుని.. డ్యూయెల్ రోల్ లో రెడ్ మూవీలో నడిచాడు. ఆ సినిమా రామ్ కి నిరాశనే మిగిల్చింది. అయితే తర్వాత రామ్ తమిళ్ డైరెక్టర్ తో కమిట్ అయ్యాడు. పందెం కోడి లాంటి హిట్స్ ఇచ్చిన లింగు స్వామితో రామ్ బైలింగువల్ మూవీ కి గ్రీన్ సింగల్ ఇచ్చేసాడు. 

ఆ సినిమాలో రామ్ ఎలా ఉంటాడన్నది పక్కనబెడితే.. రామ్ ఈమధ్యన స్టైలిష్ లుక్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ టైమ్స్ వారు రిలీజ్ చేసిన మోస్ట్ డిజైరబుల్ మాన్ గా రామ్ సెకండ్ ప్లేస్ ని ఆక్రమించాడు. అయితే ఇప్పుడు రామ్ బైలింగువల్ మూవీ రాయలసీమ నేపథ్యంలో తెరక్కబోతుంది అని, ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా రామ్ రాయలసీమ భాషను మాట్లాడబోతున్నాడని.. ప్రచారం జరుగుతుంది. పందెం కోడి సినిమాలో లింగుస్వామి రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించి హిట్ కొట్టడంతో మరోసారి అదే బ్యాక్ డ్రాప్ లో రామ్ తో సినిమా ని తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు లింగుస్వామి.

Interesting backdrop for Ram RAPO19:

Ram next with Lingusamy to be on faction backdrop

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ