Advertisementt

చైతూ సీక్రెట్ ని బయట పెట్టిన సామ్

Wed 02nd Jun 2021 03:24 PM
naga chaitanya,big secret,samantha akkineni,family man 2 series,samantha with chaitu,sama - chaitu,samantha photos  చైతూ సీక్రెట్ ని బయట పెట్టిన సామ్
Chaitu secret revealed by Samantha చైతూ సీక్రెట్ ని బయట పెట్టిన సామ్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సమంత ఐదేళ్లు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని ఒక్కటయిన క్యూట్ కపుల్. నాగ్ చైతన్య తన సినిమా షూటింగ్స్ తో తాను బిజీ, అటు సమంత సినిమాలతో, వెబ్ సీరీస్ తో బిజీ. ప్రస్తుతం లాక్ డౌన్ టైం ని కలిసి గడుపుతున్న సమంత కి నాగ చైతన్యకి ఎక్కువగానే గొడవలవుతాయట, అయితే ముందుగా నాగ చైతన్యనే కాంప్రమైజ్ అయ్యి సమంత తో మాట్లాడేస్తాడట, ఎందుకంటే నాగ చైతన్యకి సిగ్గు ఉండదు అంటూ సమంత చైతు సీక్రెట్ ని బయట పెట్టింది. ప్రస్తుతం తాను ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పిన సమంత శాకుంతలం పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే తనలో తనకు మూడు విషయాలు నచ్చుతాయంటుంది. అది తన స్మైల్, తన కళ్ళు, అలాగే తన ఫిట్ నెస్ అంటే చాలా ఇష్టమట. ప్రేక్షకులకి తనలో చాలా క్వాలిటీస్ నచ్చినా తనకి మాత్రం ఆ మూడు అంటేనే ఇష్టం అని చెబుతుంది. అంతేకాదు.. శరీరం ఫిట్ గా ఉంచుకోవడానికి వర్కౌట్స్ తప్పనిసరి అని చెబుతుంది. లాక్ డౌన్ లో శరీరం ఫిట్ గాను, మనసు ఉల్లాసంగా ఉంచుకోవడం చాలాముఖ్యమని, మనం ఎంత సంతోషంగా ఉంటే మన శరీరం అంత ఫిట్ గా ఉంటుంది అని.. అందుకే యోగ తో పాటుగా వర్కౌట్స్ కి ప్రధాన్యమిస్తా అంటుంది సమంత.

Chaitu secret revealed by Samantha:

Naga Chaitanya Big secret revealed by Samantha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ