Advertisementt

3 టైమ్స్ టాప్ లో విజయ్ దేవరకొండ

Wed 02nd Jun 2021 02:52 PM
vijay deverakonda,hyderabad times,most desirable man,ntr,ram,allu arjun  3 టైమ్స్ టాప్ లో విజయ్ దేవరకొండ
Vijay Deverakonda scores the Most Desirable Man crown yet again 3 టైమ్స్ టాప్ లో విజయ్ దేవరకొండ
Advertisement
Ads by CJ

దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్ వర్క్ గ్రూప్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన హైదరాబాద్ టైమ్స్ విభాగం రూపొందించే 30 మందితో కూడిన మోస్ట్ డిజైరబుల్ మెన్, 2020 జాబితాని విడుదల చేసారు. అందులో టాలీవుడ్ స్టైలిష్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నెంబర్ వన్ ప్లేస్ ని ఆక్రమించాడు. విజయ్ దేవరకొండ కి ఇదే మొదటిసారి కాదు.. ఏకం గా మూడోసారి వరసగా మోస్ట్ డిజైరబుల్ మెన్ గా ఎంపికై రికార్డు సృషించాడు. రౌడీ బ్రాండ్స్ తో, తనదైన స్టయిల్ తో టాలీవుడ్ హీరోలందరిని వెనక్కి నెట్టి ఇలా నెంబర్ వన్ లో ప్లేస్ లో నిలుస్తూ విజయ్ తన సత్తా చాటుతున్నాడు.

నిన్నగాక మొన్న సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పరంగా సౌత్ ఇండియా నెంబర్ వన్ గా నిలిచిన విజయ్ దేవరకొండ ఇప్పుడు మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020 గా నిలవడంతో ఆయన ఫాన్స్ పండగ చేసుకున్నారు. ఇంకా 2020 జాబితాలో రామ్ పోతినేని, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, నాగశౌర్య, నాగచైతన్య, సందీప్ కిషన్, నవదీప్, రానా దగ్గుబాటి, అఖిల్ సార్థక్, సుధీర్ బాబు, అల్లు అర్జున్ వరస స్తనాలనాల్లో నిలిచారు. అయితే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని అధిగమించి విజయ్ ఇలా మోస్ట్ డిజైరబుల్ మెన్ కేటగిరిని వరసగా మూడుసార్లు సొంతం చేసుకోవడం ఆయన ఫాన్స్ కి లెక్కలేని ఉత్సాహాన్ని ఇస్తుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి కాంబోలో లైగర్ పాన్ ఇండియా ఫిలిం చేస్తున్న విషయం తెలిసిందే.

Vijay Deverakonda scores the Most Desirable Man crown yet again:

Hyderabad Times Most Desirable Man crown

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ