గత రెండు రోజులుగా ఢిల్లీ లో బిజెపి పెద్దలని కలుస్తూ బిజీ బిజీగా ఉన్న ఈటల రాజేంద్ర బిజెపి నుండి ఏదో ఆశించే బిజెపిలోకి చేరబోతున్నాడని.. ఈటల రాజేంద్ర చేరడాన్ని చాలా మాములు విషయం అన్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పడం.. తెలంగాణ ప్రభుత్వం మీదికి సీబీఐని పంపి టీఆరెస్ నాయకులని భయపెడితేనే నేను బిజెపిలోకి చేరుతా అని ఈటల బిజెపితో బేరాలాడుతున్నాట్టుగా వార్తలొస్తున్నాయి. ఈటల రాజేంద్ర ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లారు. అయితే అక్కడ ఈటల బిజెపి పెద్దలని కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది.
ఒక వారం రోజుల్లో ఈటల రాజేంద్ర బిజెపిలోకి వస్తారని, దానికి ప్రతిఫలంగా ఈటెలకీ ఎలాంటి హామీ లేదని, ఆయన మామూలుగానే బిజెపిలోకి చేరబోతున్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా సమావేశంలో ఈటల ఇష్యు పై క్లారిటీ ఇచ్చారు. ఒక వారం రోజుల్లో ఈటల బీజేపీ ఎంట్రీ ఖాయమైనట్లుగా బండి సంజయ్ చెప్పారు. ఈటెలని బీజేపీలోకి ఆహ్వానించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు లేవని చెబుతున్నారు సంజయ్. ఈటల రాత్రి కిషన్ రెడ్డిని కలిసి ఈ రోజు ఢిల్లీ నుండి హైదరాబాద్ కి తిరిగి పయనమవబోతున్నారు. ఇక ఈ రోజు ఈటల బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.