సినిమాల్లో విలన్ వేషాలను వేసుకునే సోను సూద్ గత ఏడాది కరోనా లాక్ డౌన్ నుండి దేవుడి అవతారమెత్తాడు. పేదలకి అండగా మారిన సోను సూద్ ఇప్పటివరకు కరోనా పేషేంట్స్ ని, ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకుంటూ దేవుడి మాదిరి అందరి గుండెల్లో కొలువయ్యాడు. అయితే సినిమాల్లో విలన్ రోల్స్ చేసే సోను సూద్ రియల్ గా కూడా విలన్ గానే ఉండేవాడట. అయితే ఇప్పుడు దేవుడిగా పూజింపబడుతున్న సోను సూద్ ఒకప్పుడు నిజంగా మానసున్నోడు కాదట. ఆ మాట ఓ తెలుగు దర్శకనిర్మాత చెబుతున్నారు. ఆయనెవరో కాదు తమ్మారెడ్డి భరద్వాజ. సోను సూద్ ఇప్పుడు దేవుడయ్యాడు కానీ ఆయన ఒకప్పుడు చాలా కమర్షియల్ అంటూ ఒక సీక్రెట్ బయటపెట్టారు.
ఓసారి చారిటి షో కోసం సోను సూద్ ని రమ్మని పిలిస్తే.. ఈ ఈవెంట్ కి నాకెంత మనీ ఇస్తారు అంటూ బేరం ఆడాడట. తమ్మారెడ్డి అంగవైకల్యం ఉన్న పిల్లల కోసం ఓ కార్యక్రమాన్ని చేపట్టి సోను సూద్ ని గెస్ట్ గా ఆహ్వానిస్తే.. ఈ షో కి నేను రావాలంటే ఎంతిస్తారు అని మొహమాట పడకుండా అడిగాడు. డబ్బు గురించే ఆలోచించే అదే సోను సూద్ ఇలా సహాయం చేస్తూ దేవుడిగా మారాడు. ఎందుకో ఆ సంఘట నాకు గుర్తుచ్చింది అంటూ తమ్మారెడ్డి ఒక సందర్భంలో సోను సూద్ విషయం బయటపెట్టారు. కరోనా పేషెన్స్ కోసం దేశం మొత్తం ఆక్సిజెన్ ప్లాంట్స్ ని ఓపెన్ చేస్తూ.. అవసరమైన వారికి ఆక్సిజన్ అందిస్తూ ప్రాణదాత అవుతున్నారు సోను. కరోనా పేషేంట్స్ కి అండగా నిలుస్తూ దేవుడిలా సోను సూద్ పూజింపబడుతున్నాడు.