Advertisementt

మహేష్ కోసం కథ సిద్ధం కాలేదట

Tue 01st Jun 2021 06:33 PM
mahesh-rajamouli combo,m producer k.l narayana,mahesh babu,rajamouli  మహేష్ కోసం కథ సిద్ధం కాలేదట
Clarity on Mahesh-Rajamouli film from producer మహేష్ కోసం కథ సిద్ధం కాలేదట
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. సెకండ్ వేవ్ లేకపోతె ఈపాటికి చాలావరకు షూటింగ్ పూర్తయ్యేదే. అయితే సర్కారు వారి పాట తరవాత మహేష్ బాబు త్రివిక్రమ్ తో మరో సినిమా చెయ్యడానికి కమిట్ అయ్యి ప్రకటన ఇప్పించేసాడు. అసలైతే మహేష్ సర్కారు వారి పాట తర్వాత రాజమౌళి తో సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ రాజమౌళికి ఆర్.ఆర్.ఆర్ తర్వాత కాస్త విరామం తీసుకుందామనుకుని మహేష్ ని మరో సినిమా చేసుకోమండంతో మహేష్ త్రివిక్రమ్ ని లైన్ లో పెట్టుకున్నాడు. మహేష్ - రాజమౌళి కాంబో కథపై చాలా స్టోరీస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

రాజమౌళి మహేష్ ని కౌ బాయ్ గా చూపిస్తాడని అబ్బో ఇలాంటివి చాలానే ప్రచారంలో కొచ్చాయి. తనతో తొమ్మిదేళ్ల క్రితమే సినిమా చేస్తా అని మాటిచ్చినా బాహుబలి రెండు పార్టులు, ఆర్.ఆర్.ఆర్ ఆలస్యమవడంతో రాజమౌళి కి మహేష్ సినిమా చేసే విషయంలో ఆలస్యం జరుగుతుంది.. అసలైతే మా సినిమా ఈ ఏడాదే మొదలవ్వాల్సి ఉంది. కానీ సెకండ్ వేవ్, ఆర్.ఆర్.ఆర్ లెట్ అవుతున్న కారణంగా మా సినిమా వచ్చే ఏడాది మొదలవుతుంది అంటున్నరాయన. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే మహేష్ తో చెయ్యబోయే సినిమాకి రాజమౌళి ఇంకా కథ రెడీ చేయలేదట. రాజమౌళి ఇప్పటివరకు హీరోలని దృష్టిలో కథలు ప్రిపేర్ చెయ్యలేదు. కానీ ఇప్పుడు మహేష్ ని మనసులో పెట్టుకునే కథ ప్రిపేర్ చెయ్యాల్సి ఉంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత బాగా రిలాక్స్ అయ్యాక మహేష్ కి కథ రెడీ చేస్తాడేమో రాజమౌళి.

Clarity on Mahesh-Rajamouli film from producer:

Clarity on Mahesh-Rajamouli film from producer K.L Narayana

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ