నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు ఉదయమే సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న 18 పేజెస్ మూవీ ఫస్ట్ లుక్ ని వదిలారు. ఆ లుక్ లో అనుపమ పరమేశ్వరన్ తనకి ఫోన్ లొ లెటర్స్ టైప్ చేయడం కన్నా పెన్ను తో రాయడమే ఇష్టం అంటూ ప్రేమతో నిఖిల్ కళ్ళకి పేపర్ తో గంతలు కట్టి మరీ పెన్ను తో రాస్తున్న రొమాంటిక్ స్టిల్ ఆకట్టుకునేలా ఉంది. నిఖిల్ బర్త్ డే స్పెషల్ గా సినిమా ప్రముఖులంతా ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా నిఖిల్ కి ఓ సర్ప్రైజ్ అయన ఇంటికే డైరెక్ట్ గా వచ్చింది.
అది 18 పేజెస్ టీం ఆయనకి ఓ స్మాల్ సర్ప్రైజ్ అంటూ పెద్ద కేక్ ని నిఖిల్ కి పంపించారు. డోర్ తీసి ఆ బిగ్ సర్ప్రైజ్ చూడగానే షాకయిన నిఖిల్ దానిని తీసుకెళ్లి టేబుల్ మీది పెట్టి ఓపెన్ చేసేలోపు గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి, దర్శకుడు సూర్య ప్రతాప్ నుండి, సుకుమార్ గారి నుండి, బన్నీ వాస్ నుండి మీకు బర్త్ డే విషెస్ అంటూ ఓ పూల బొకే ఇచ్చి మరింతగా సర్ప్రైజ్ చేసారు. మరి నిఖిల్ ఎంతో హుషారుగా కేక్ కట్ చేద్దామని చూడగా ఆ కేక్ మీద 18 పేజెస్ ఫస్ట్ లుక్ ని ప్రింట్ చెయ్యగా.. అబ్బా ఇంత అందమైన లుక్ ని ఎవరైనా కట్ చేస్తారా అంటూ నిఖిల్ ఈ కేక్ ని దాచేద్దామా అంటూ పట్టుకెళ్ళిపోయాడు. మరి నిఖిల్ బర్త్ డే కి టీం మొత్తం పంపిన కేక్ ని బొకేని చూసి నిఖిల్ అందరికి పేరు పేరునా థాంక్స్ చెప్పుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్ కి పంపిన స్మాల్ సర్ప్రైజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.