ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరు స్టార్ హీరోలైన ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. వారి ఇద్దరూ టాలీవుడ్ టాప్ హీరోస్. అభిమానులును సమానంగా మెయింటింగ్ చేసే తారక్ - చరణ్ ల అల్లూరి పాత్ర కానీ, కొమరం భీం పాత్ర గాని ఆర్.ఆర్.ఆర్ లో కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా రాజమౌళికి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాత జాతరే. అలాంటి హీరోలను రాజమౌళి ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు. ఇద్దరికి ఎంతెంత స్క్రీన్ స్పేస్ ఇస్తున్నాడు. ఒకరు ఎమోషనల్ గానూ, ఒకరి యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంటారని ప్రచారం ఉన్నా ఆ బ్యాలెన్స్ ని ఇద్దరి ఫాన్స్ అర్ధం చేసుకుంటారో ఏమో. ఇక ఇప్పడు ఆర్.ఆర్.ఆర్ లో చరణ్ - తారక్ కలిసి ఫైట్ చేసే సీన్స్ సంగతి ఎలా ఉన్నా వారిద్దరూ కలబడడం అన్న విషయం ఉత్కంఠకి గురి చేస్తుంది.
రాజమౌళి ఫాదర్, ఆర్.ఆర్.ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఆర్.ఆర్.ఆర్ ఫైట్ సీన్స్ చూస్తే విజిల్స్, గూస్ బంబ్స్ రావు కళ్ళవెంట కన్నీళ్లు వస్తాయి. నేను సినిమా చూసాను. ఆర్.ఆర్.ఆర్ ఫైట్ సీన్స్ లో ప్రేక్షకుడు కంటతడి పెట్టడం ఖాయమంటున్నారాయన. అది ఎందుకు అంటే ఇద్దరు సూపర్ స్టార్స్ కొట్టుకుంటే.. చూడలేము. ఎమోషనల్ గా ఫీలవుతాము. అరే ఆపండ్రా కొట్టుకోవద్దు అని చెప్పాలనిపిస్తుంది. ఆర్.ఆర్ .ఆర్ లో అదే ఉండబోతుంది. అంటే రామ్ చరణ్ - తారక్ కలబడితే ప్రేక్షకుడికి కన్నీళ్లే అంటున్నాడాయన. అవును ఓ తల్లి ఇద్దరు కొడుకులు కొట్టుకుంటుంటే వాళ్ళని ఆపమని ప్రాధేయపడుతూ ఏడుస్తుంది. ఆ ఫైట్ సీన్ తర్వాత ఆ తర్వాత వారు ఎక్కడ ఎలా కాలియాశారో ఉంటుంది అంటూ కాస్త హింట్ ఇచ్చేసారు.
దానితో ఆయన ఆర్.ఆర్.ఆర్ లో చరణ్ - తారక్ మధ్యన ఫైట్ ఉంటుంది అని కంఫర్మ్ చేసేసారు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలైన రామ్ చరణ్ - తారక్ లు కలబడితే థియేటర్స్ లో ప్రేక్షకుల ఫీలింగ్ ఎలా ఉంటుందో జస్ట్ ఓ సారి ఊహించుకోండి.