Advertisementt

పవన్ కి కథ అక్కర్లేదు.. కానీ మహేష్ కి మాత్రం

Tue 01st Jun 2021 01:35 PM
writer,director,vijayendra prasad,pawan kalyan,mahesh babu,alitho saradaga show,rajamouli  పవన్ కి కథ అక్కర్లేదు.. కానీ మహేష్ కి మాత్రం
Vijayendra Prasad about Pawan Kalyan and Mahesh పవన్ కి కథ అక్కర్లేదు.. కానీ మహేష్ కి మాత్రం
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ కి కథ రాయాల్సి వస్తే.. ఎలాంటి కథ రాస్తారు అనగానే రాజమౌళి ఫాదర్, ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఎలాంటి జవాబు చెప్పారో తెలుసా.. ఎవరూ ఊహించి ఉండరు కూడా.. పవన్ కళ్యాణ్ కి కథ అక్కర్లేదట. ఆయన అందగాడు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫాన్స్ కి పండగే. పవన్ కళ్యాణ్ రెండు మూడు పాటల్లో హీరోయిన్స్ తో డాన్స్ లు, పాటలు పాడడం, ఆయన మ్యానరిజం, విలన్స్ ని కొట్టే ఫైట్ సీన్స్ ఉంటె చాలు.. అయన సినిమాల్లో కథ ఎవరూ పట్టించుకోరు.. అక్కడక్కడా కొన్ని సీన్స్ అల్లుకుంటూ పొతే చాలు సినిమా అయ్యిపోతుంది అంటూ విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ డైనమేట్ అంటూ గత రాత్రి ఈటీవీలో ప్రసారం అయిన అలీ తో సరదాగా ప్రోగ్రాం లో చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. మహేష్ బాబు కి ఎలాంటి కథ రాస్తారు అని అలీ అనగానే.. మహేష్ బాబు కి కథ అంటే.. అబ్బో.. చాలా టఫ్ జాబ్.. ఆయనకి కథ రాయాలంటే నా శత్రువు పూరి జగన్నాధ్ ని అడుగుతాను అంటూ ఫన్నీగా మాట్లాడారు విజయేంద్ర ప్రసాద్. తన కొడుకు తర్వాత తనకి పూరి జగన్నాధ్ అంటే ఇష్టమని.. ఆయనలోని స్కిల్స్ బాగా నచ్చుతాయని, ఆయన తీసే ఫైట్స్ సీన్స్ చాలా బావుంటాయని, ఆయన్ని ద్వేషిస్తాను అని, అందుకే నా ఫోన్ లో స్క్రీన్ సేవర్ గా పూరి పిక్ ఉంటుంది అంటూ అది చూపించరాయన. ఇంకా సింహాద్రి కథ ముందుగా బాలకృష్ణ గారి కోసం రాశామని, కానీ ఆయన కి కథ నచ్చక పోవడంతో.. అది ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది అంటూ చాలా విషయాలను ఆయన ఈ షో లో ముచ్చటించారు.

Vijayendra Prasad about Pawan Kalyan and Mahesh:

Puri Jagannadh Is My Favorite Director Says Vijayendra Prasad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ