ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమాలు
తెలుగువారికి ఇష్టమైన నటుడు ఎన్టీఆర్ శతజయంతి వచ్చే ఏడాది జరగనుంది. ఈ సందర్భంగా వచ్చే ఏడాది మే 28వ తేదీ నుంచి 2023 మే 28 దాకా సంవత్సరం పాటు వినూత్నంగా ఉత్సవాలను నిర్వహించాలని సినీ నిర్మాత, దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి సంకల్పించారు.
ఎన్టీఆర్ బంధుమిత్రులు, సన్నిహితులు, ఆయనతో కలిపి పనిచేసిన వారు అనేక మంది ఉన్నారు. వీరందరికీ ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానముంది. ఆయనతో వారికి ఉన్న అనుబందాన్ని డిజిటల్ ఇంటర్వ్యూల రూపంలో నిక్షిప్తం చేయాలని సంకల్పిస్తున్నాం.
దీనికి అవసరమైన పనులన్ని టినీ పూర్తిచేసి.. మొదటి ఇంటర్వ్యూలను, కార్యక్రమాలను మే 28 నాటికి డిజిటల్ మాధ్యమాలలో ప్రసారం చేస్తాం, వీటిలో కొన్ని ఇంటర్వ్యూలను యాంకర్ల చేత చేయిస్తాం. కొన్నింటిని నేనే స్వయంగా చేస్తా అని ఆయన పేర్కొన్నారు.
ఎన్టీఆర్ తెలుగు వారికి చేసిన సేవలను మరో సారి గుర్తుకుతెచ్చేలా ఈ ఇంటర్వ్యూలు ఉంటాయని చౌదరి వెల్లడించారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తాము చేపట్టిన ఈ కార్యక్రమాలకు తోడ్పడాలని అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. ఒక నటుడు, ప్రజానాయకుడికి సంబంధించిన జ్ఞాపకాలను.. అనుభవాలను డిజిటల్ రూపంలో భద్రపరచటానికి ప్రయత్నించటంలో తెలుగులో ఇదే ప్రధమం.