Advertisementt

పుష్ప ఓవర్సీస్ డీల్ ఫినిష్

Mon 31st May 2021 08:48 PM
allu arjun - sukumar combo,pushpa pan india film,pushpa overseas business,pushpa deals closed,allu arjun,sukumar,pushpa overseas business deal  పుష్ప ఓవర్సీస్ డీల్ ఫినిష్
PUSHPA Overseas Business deals closed? పుష్ప ఓవర్సీస్ డీల్ ఫినిష్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ పై అన్ని భాషల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, కన్నడ, మలయాళంలో సూపర్ ఫామ్ ఉన్న అల్లు అర్జున్.. మొదటిసారి హిందీలోకి అడుగుపెడుతున్న అల్లు అర్జున్ పుష్పకి అక్కడ కూడా క్రేజ్ ఉంది. సుకుమార్ రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అవడం, అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీసుని ఈ హీరో - దర్శకుడు దున్నేయడానికి సిద్దమైపోతున్నారు. ఇప్పటికే అన్ని భషాల్లో మంచి అంచనాలున్న పుష్ప కి ఇప్పుడు ఓవర్సీస్ నుండి భారీ డీల్ కుదిరినట్టుగా తెలుస్తుంది. 

అల్లు అర్జున్ ఇంతకుముందు సినిమాలు ఒక ఎత్తు.. ఇప్పడు ఈ పుష్ప ఒక ఎత్తు అన్న రేంజ్ లో ఓవర్సీస్ డీల్ ఫినిష్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ డీల్ ఎంతకి తెగింది.. అనేది ఇంకా లెక్కలు బయటికి రాకపోయినా అల్లు అర్జున్ పుష్ప కి భారీ రేటు వచ్చింది అనేది మాత్రం తెలుస్తుంది. మరి రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ గా నిలవబోతుంది అని అంటుంటే.. ఈసినిమాలో ఐటెం సాంగ్ వేరే లెవల్లో ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

PUSHPA Overseas Business deals closed?:

Allu Arjun - Sukumar PUSHPA Overseas Business deals closed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ