Advertisementt

సమంత సైలెంట్ కి కారణమదే

Mon 31st May 2021 05:59 PM
amazon prime video,family man 2,the family man 2,famili man web series,orders,silence,samantha akkineni  సమంత సైలెంట్ కి కారణమదే
Samantha Stopped From Making Comments On The Family Man 2 Controversy సమంత సైలెంట్ కి కారణమదే
Advertisement
Ads by CJ

జూన్ 4 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతున్న ఫామిలీ మ్యాన్ 2 కోసం యావత్ ఇండియా ఎదురు చూస్తుంది. ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అవడంతో.. ఇప్పుడు సీజన్ 2 పై అంచనాలు, ఆత్రుత అంతకంతకు ఎక్కువైపోతున్నాయి. అయితే ఇండియాలోని ప్రేక్షాలంతా ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం ఎదురు చూస్తుంటే తమిళ ప్రేక్షకులు మాత్రం ఫ్యామిలీ మ్యాన్ ని బ్యాన్ చెయ్యాలంటూ కేంద్రమంత్రికి లేఖ రాయడమే కాదు.. ఫ్యామిలీ మ్యాన్ 2 పై తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 లో తమిళ టైగర్లను చెడుగా చూపిస్తున్నారని తమిళులు తీవ్రమైన అభ్యంతరాలు చేశారు. అందులోనూ సౌత్ బ్యూటీ సమంత చేసిన టెర్రరిస్ట్ రోల్ పైనే తమిళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వివాదంపై దర్శకుడు రాజ్ అండ్ డీకే లు స్పందించారు. తమిళ చరిత్రని అవమానించేలా ఈ వెబ్ సీరీస్ లో ఎక్కడా లేదని.. పూర్తిగా చూసాక దానిపై మాట్లాడండి అంటూ స్పందించినా.. ఈ సీరీస్ లో లీడ్ రోల్ చేసి వివాదాస్పద పాత్రకు కారణమైన సమంత మాత్రం మౌనం వహిస్తుంది. సమంత మౌనానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై స్పందించవద్దు అంటూ ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు సమంత కి చెప్పారని,  కాదు కోలీవుడ్ లో సమంత చేస్తున్న సినిమాలకు తమిళ ప్రేక్షకుల మద్దతు అవసరం. అనసరంగా ఈ వివాదంలో ఇరుక్కుని సమంత మళ్ళీ దాని విషయం మాట్లాడితే కోలీవుడ్ ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో తెలియదు. అందుకే సమంత ని కామ్ గా ఉండమని కోలీవుడ్ లో ఆమె చేస్తున్న దర్శకుడు చెప్పారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Samantha Stopped From Making Comments On The Family Man 2 Controversy:

Amazon Prime Video orders silence for Samantha Akkineni

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ