Advertisementt

ఆరడుగుల బుల్లెట్ అకీరా

Sat 05th Jun 2021 04:52 PM
powerstar pawan kalyan,son akira nandan,pawan son akeera,music teacher,pawan new pic,akira latest pic  ఆరడుగుల బుల్లెట్ అకీరా
Akira Nandan pic goes viral! ఆరడుగుల బుల్లెట్ అకీరా
Advertisement
Ads by CJ

స్టార్స్ పిల్లల ఫొటోస్ సోషల్ మీడియాలో కనిపిస్తే ఆయా హీరోల ఫాన్స్ అస్సలు ఆగరు. అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలు తమ పిల్లల ఫొటోస్ ని వాళ్లతో గడిపిన బెస్ట్ మూవ్మెంట్స్ ని తరుచూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. కానీ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తన పిల్లలని పెద్దగా ఫోకస్ కానివ్వరు. అందులోనూ పవన్ కళ్యాణ్ కొడుకు కానీ కూతురు కానీ సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు పవన్ సన్ ఎప్పుడు హీరో అవుతాడో అంటూ ఫాన్స్ ఆత్రుత పడుతుంటారు. పవన్ కొడుకు అకీరా ఎక్కడ కనిపిస్తాడా ఫోటో క్లిక్ మనిపించాలనే ఇంట్రెస్ట్ తో అందరూ చూస్తుంటారు. మరి హీరోల పిల్లలు అప్పుడప్పుడు సోషల్లో మీడియాలో  చేసే సందడితోనే ఫాన్స్ పండగ చేసుకుంటారన్నది తెలిసిందే.

తాజాగా పవన్ కళ్యాణ్ ఆయన కొడుకు అకీరా తో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అకీరా నందన్ తండ్రి పక్కన నించుని ఫోటో కి ఫోజులిచ్చాడు. పవన్ కన్నా ఒడ్డు, పొడుగు విషయంలో ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తున్న అకీరా లుక్ చూసిన పవన్ ఫాన్స్ వీడు ఆరడుగుల బుల్లెట్టు అంటూ సాంగ్ ఏసుకుంటున్నారు. చక్కటి ఫిజిక్ తో, చాలా హైట్ గా పవన్ - రేణు దేశాయ్ అందం కలబోసి కనిపిస్తున్నాడు. కొన్నాళ్లుగా రెస్ట్ లో ఉన్న పవన్ కళ్యాణ్ తన కొడుకు అకిరానందన్‌తో కలిసి సంగీతం నేర్చుకుంటున్నారట. ఇందుకోసం ఓ మ్యూజిక్ టీచర్‌ని కూడా పెట్టుకున్నారు. ఆ సందర్భంగా ఆ సంగీతం టీచర్ పవన్ అండ్ అకీరా తో కలిసి దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. అకీరా ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

అంతేకాదు బండ్ల గణేష్ లాంటి వారు నా దేవుడితో నా హీరో అంటూ క్యాప్షన్స్ పెట్టేసి మరీ ట్వీట్లు వేసుకుంటున్నారు. ఇక పవన్ అండ్ ఆయన తనయుడు అకీరాలు తన దగ్గర సంగీతం నేర్చుకుంటూ తన శిష్యులుగా మారడం చాలా ఆనందంగా ఉందని.. ఈరోజు వాళ్లకి డెమో క్లాస్ ఇవ్వడం జరిగిందని.. దానితో పవన్ గారితో కొన్ని గంటలు స్పెండ్ చేసే టైం దొరికినట్లుగా ఆ సంగీతం టీచర్ ఎమోషన్ అవుతున్నారు.

Akira Nandan pic goes viral!:

Powerstar Pawan Kalyan was spotted with his son Akira Nandan in a picture

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ