ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూలు నడుస్తున్నాయి. కరోనా కేసులు పెరిగిపోవడంతో ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్టి కేసులను కంట్రోల్ చేస్తున్నాయి. లాక్ డౌన్ మంచి సత్ఫలితాలను ఇచ్చి దేశంలో కరోనా కేసులు తగ్గుదల కనిపిస్తుంది. ఒకప్పుడు నాలుగు లక్షల పైమాటే కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పుడు ఆ కేసుల సంఖ్య లక్షా యాభై వేలకి దిగువకు చేరుకుంది. లాక్ డౌన్ వలనే ఇది సాధ్యమని చెబుతున్నారు. దానితో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూలని పొడిగించుకుంటూ పోతున్నాయి.
తాజాగా ఏపీలో 18 గంటల కర్ఫ్యూని మరోసారి పొడిగించింది జగన్ ప్రభుత్వం. జూన్ 10 వరకు ఏపీలో 18 గంటల కర్ఫ్యూ కొనసాగుతుంది అని, ఇప్పటివరకు కర్ఫ్యులో ఎలాంటి సడలింపులు అయితే ఉన్నాయో.. జూన్ పది వరకు అవే సడలింపులు కంటిన్యూ చేస్తామని.. మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది.. అని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ రోజుతో కర్ఫ్యూ గడువు ముగియడంతో ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి.. కర్ఫ్యూ కొనసాగించడం వల్ల కరోనా ప్రభావాన్ని మరింత తగ్గించవచ్చి అనే అభిప్రాయంతో కర్ఫ్యూని కంటిన్యూ చేస్తున్నట్లుగా తెలిపారు.