Advertisementt

వెబ్ సీరీస్ కోసం రెడీ అవుతున్న వెంకీ

Mon 31st May 2021 09:51 AM
venkatesh,signs venkatesh mqaha,amazon prime videos,venky,web series  వెబ్ సీరీస్ కోసం రెడీ అవుతున్న వెంకీ
Venkatesh signs a new film with Venkatesh Maha వెబ్ సీరీస్ కోసం రెడీ అవుతున్న వెంకీ
Advertisement
Ads by CJ

విక్టరీ వెంకటేష్ కొన్ని ఏళ్లగా రీమేక్ లకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. స్ట్రయిట్ కథలతో హిట్స్ పడవనుకున్నారో? లేదంటే వయసుకు సరిపోయే రీమేక్స్ చేసుకుంటే కెరీర్ సాఫీగా ఉంటుంది అనుకున్నారో కానీ.. ఎక్కువగా వెంకీ రీమేక్ లనే ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే తమిళ అసురన్ ని నారప్ప గా రీమేక్ చేసిన వెంకటేష్ మలయాళ దృశ్యం 2 ని తెలుగులో రీమేక్ చేసి ఈ రెండు సినిమాల విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. మరోపక్క అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు.

అదంతా అలా ఉంటే.. ఇప్పుడు వెంకటేష్ ఓ వెబ్ సీరీస్ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. అది కూడా యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వంలో వెంకటేష్ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. ప్రముఖ ఓటిటి సంస్థ కోసం వెంకీ ఈ వెబ్ సీరీస్ చెయ్యబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. కంచర పాలెం ఫేమ్ వెంకటేష్ మహా మొన్నామధ్యన రానా తో మూవీకి కమిట్ అయ్యాడనే టాక్ నడిచినా ఇప్పుడు వెంకీ తో వెబ్ సీరీస్ కోసం కథ రెడీ చేసి వినిపించాడని ఆల్మోస్ట్ వారి కాంబోలో ఈ వెబ్ సీరీస్ కన్ ఫర్మ్ అనే న్యూస్ వినిపిస్తుంది. అది కూడా సురేష్ ప్రొడక్షన్స్ లో అంటున్నారు.

Venkatesh signs a new film with Venkatesh Maha:

Venkatesh signs Venkatesh for Prime

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ