ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ మూవీ షూటింగ్ చడీ చప్పుడు లేకుండానే 30 శాతం పూర్తి చేసుకోవడం ప్రభాస్ ఫాన్స్ కి కిక్ ఇస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.. సీత కేరెక్టర్ కృతి సనన్ నటిస్తుంది. పెద్దగా ఫేమ్ లేని కృతి సనన్ ని హీరోయిన్ గా తీసుకోవడంపై ప్రభాస్ ఫాన్స్ కాస్త ఫీలయినా.. ఇప్పుడు అడ్జెస్ట్ అవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఏడు ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న కృతి సనన్ కెరీర్ లో ఆదిపురుష్ ఎంతో ప్రత్యేకం అంటుంది. ప్రస్తుతం లాక్ డౌన్ వలన ఆదిపురుష్ షూటింగ్ కి బ్రేకులు పడడంతో టీం మొత్తం ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు.
లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉంటున్న కృతి సనన్ ఆదిపురుష్ షూటింగ్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చేస్తూందట. అయితే ప్రస్తుతం ఈ ఖాళీ సమయాన్ని ఆదిపురుష్ డైలాగ్స్ ప్రాక్టీస్ చెయ్యడానికి వినియోగిస్తున్న అని చెబుతున్న కృతి సనన్.. ఆదిపురుష్ తో పాటుగా తన మరో ప్రాజెక్ట్ గణపత్ కోసం కూడా అంతే ఆత్రంగా ఉన్నాను అంటుంది. ఈ కరోనా సెకండ్ వేవ్ క్లిష్ట సమయంలో మనమంతా ఒకటిగా నిలవాలని, మనకు సాయం చేసిన వారికి మనం కూడా సాయం చేయాలని అభిమానుల్ని కోరింది కృతి సనన్.