గత కొన్ని రోజులుగా ఈటెల రాజేంద్ర వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ ని రాజేస్తోంది. ఈటెల ని తెలంగాణ ప్రభుత్వ మంత్రి మండలి నుండి తప్పించినప్పటినుండి ఈటెల రాజేంద్ర రాజకీయ భవిష్యత్తు ఉత్కంఠకి గురి చేస్తుంది. ఈటెల రాజేంద్ర కాంగ్రెస్ నాయకులతో పాటుగా, టీఆరెస్ లోని కొతమందితో మంతనాలు జరపడం, అలాగే బిజెపి కి టచ్ లోకి వెళ్లడం, మరోపక్క ఆయన కుమారుడు నితిన్ పై తెలంగాణ ప్రభుత్వం భూకబ్జా ఆరోపణలు తో చర్యలకు సిద్దమవడం తో తెలంగాణ పాలిటిక్స్ కరోనా కేసుల కన్నా ఎక్కువ ఉత్కంఠ భరితంగా మారాయి.
అయితే కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈటెల ని బీజేపీలోకి ఆహ్వానించడంపై కొంతమంది బిజెపి నేతలు వ్యతిరేకిస్తున్నా.. ఈటెల బిజెపి ఎంట్రీ దాదాపు ఖాయమనే మాట గత రెండూ రోజులుగా మీడియాలో వినిపిస్తూనే ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈటల బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్టేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈరోజు ఈటెల రాజేంద్ర ఢిల్లీ టూర్ మొదలయ్యింది. ఈటెల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా వెళుతున్నారు. అలాగే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రేపు ఢిల్లీ టూర్ ప్రాధాన్యతని సంతరించుకుంది. రేపు ఈటల బీజేపీ అగ్రనేతలను కలిసి.. అన్నీ మట్లాడుకుని బిజెపి తీర్ధం పుచ్చుకోబోతున్నారని అందుకే ఈ ఢిల్లీ టూర్ అంటున్నారు.