సౌత్ లోకి దేవదాసు సినిమాతో అడుగుపెట్టి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి.. ఆ తర్వాత సన్నజాజి నడుముతో సౌత్ ప్రేక్షకులని మాయ చేసిన ఇలియానా ఇక్కడ స్టార్ హీరోలందరితో నటిస్తూనే బాలీవుడ్ పై కన్నేసింది. బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ సినిమాలు చేస్తూనే బాయ్ ఫ్రెండ్ ఆండ్రు తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెరీర్ ని నిర్లక్ష్యం చేసి నాజూకు సుందరి కాస్త బబ్లీ సుందరిగా మారిపోయింది. బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అవడంతో డిప్రెషన్ తో బాధపడిన ఇలియానా మరోసారి కెరీర్ ని చక్కదిద్దుకునే ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈమధ్యన అమెజాన్ ప్రైమ్ వారికి ఓ టాక్ షో చెయ్యబోతున్న ఇలియానా.. అటు బాలీవుడ్ లో ఓ మూవీలో చేస్తుంది.
అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీపై ఇలియానా షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీ క్రూరమైంది అని, ఇక్కడ సమానత్వం ఉండదని.. అవకాశాలు అందడంతో అందరూ ఒకలా ఉండరు అని, పాపులారిటీ మీదే ఇండస్ట్రీ నడుస్తుంది అని.. ఎప్పడైతే ఫేమ్ కోల్పోతారో అప్పుడే అవకాశాలు చేజారిపోతాయని.. ఇలాంటి క్రూరత్వం ఉన్న చోట నిలబడడం కష్టము. తన విషయంలో అదే జరిగింది.. అంటూ ఇండస్ట్రీలో క్రేజ్ పైనే, పాపులారిటీపైనే నడుస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.