గత 20 రోజులుగా తెలంగాణాలో కఠినంగా లాక్ డౌన్ అమలవుతుంది. ఉదయం పై గంటల నుండి మళ్ళీ ఉదయం ఆరు గంటల వరకు తెలంగాణాలో లాక్ డౌన్ అమలు చేస్తుంది ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతుండడంతో నైట్ కర్ఫ్యూ నుండి లాక్ డౌన్ దిశగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ముందు పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ తర్వాత మరో పది రోజుల పాటు పాడిగించారు. అది ఈరోజుతో పూర్తి అవుతుంది. మే 30 వరకు 20 గంటల లాక్ డౌన్ లో వన్ తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ముగించి నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్స్ పై దృష్టి పెడుతుంది అని ప్రచారం జరుగుతుంది. అయితే కేసీఆర్ మే 30 న మంత్రులతో కేబినెట్ మీటింగ్ పెట్టి తెలంగాణాలో లాక్ డౌన్, తదితర అంశాలపై చర్చించి తెలంగాణాలో లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకున్నారు.
మరో పది రోజుల పాటు తెలంగాణాలో లాక్ డౌన్ పెంచుతున్నట్టుగా చెప్పిన కేసీఆర్ లాక్ డౌన్ సడలింపులు గైడ్ లైన్స్ ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చారు. ఇంటి నుంచి బయటికి వచ్చిన వారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల లోపు ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. రెండు గంటల తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. తెలంగాణ పరిమితంగా వాణిజ్య కార్యకలాపాలకు క్యాబినెట్ ఆమోదం లభించిందని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల అవుతాయని ప్రకటించారు.