కరోనాతో మూతబడిన థియేటర్స్ జనవరిలో తెరుచుకున్నాక.. ఆ నెలాఖరున యాంకర్ ప్రదీప్ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విడుదలై సో సో టాక్ తో బ్రేక్ ఈవెన్ తో నిర్మాతలను ఒడ్డున వేసింది. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. పూర్వ జన్మల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం సాంగ్ బిగ్గెస్ట్ హిట్ అవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడినా.. కథలో బలం లేకపోవడంతో ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా దర్శకుడు మున్నా ముందు ఈ కథని సమంతకి చెప్పానంటున్నాడు. సమంత కి కథ చెప్పడానికి వెళితే సమంత మేనేజర్.. నా వంక పైకి కిందకి చూడగా.. అతన్ని నా కథతో మెప్పించాను.
ఆ తర్వాత సమంతకి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కథ చెప్పగా ఆమె కథ బావుంది అని మెచ్చుకున్నారు. కానీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో సమంత మా సినిమా చేయలేదని చెబుతున్నాడు. అయితే సమంతకి స్టోరీ చెప్పినప్పుడు హీరోగా ప్రదీప్ ని అనుకోలేదని, ఆ తర్వాతే ప్రదీప్ ని హీరోగా అనుకుని సినిమా స్టార్ట్ చేశామని.. ఇక అమృత అయ్యర్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నప్పటికీ.. అమృత లో సమంత ని చూసుకుంటూ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా షూటింగ్ ని పూర్తి చేశామంటూ దర్శకుడు షాకింగ్ విషయాలు చెప్పాడు.