బాలకృష్ణ ఈమధ్యన ఇండస్ట్రీ విషయంలో ఒక్కడే పోరాడుతున్నాడు. చిరు - నాగ్ లు ఇండస్ట్రీ పరిస్థితులపై నిర్ణయాలు తీసుకుంటూ బాలయ్యని పక్కనబెట్టడంతో ఆ విషయంలో బాలయ్య ఒక్కోసారి చిరు మీద డైరెక్ట్ గానే పంచ్ లు వేస్తున్నారు. అలాంటి విషయాలను నిర్మాత సి కళ్యాణ్ బాలకృష్ణ కి వత్తాసు పలకడం.. చూస్తూనే ఉన్నాము. గతంలో సి కళ్యాణ్ మెగా హీరోలతో సినిమాలు చేసి మునిగిపోయి మెగా కాంపౌండ్ కి దూరమయ్యి బాలయ్యకి దగ్గరయ్యాడని అంటుంటారు. ఆ ప్రచారానికి చెక్ పెడుతూ తనకి బాలయ్య దగ్గర చనువు పెరగడానికి, మెగా హీరోలతో ఎందుకు గ్యాప్ వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
బాలయ్య దగ్గర ఇండస్ట్రీ విషయాలను చెప్పడానికి అందరూ భయపడుతుంటారు. కానీ నాకు మాత్రం అయన దగ్గర అన్ని విషయాలను చెప్పే చనువు ఇచ్చారు. ఏ విషయమైనా ఆయనతో ఓపెన్ గా మాట్లాడగలను. ఆయనకి నచ్చని ఏ విషయమైనా మొహం మీదే చెప్పేస్తారు. ఆయనలో అదే నాకు నచ్చుతుంది. నేను ఆయన సేమ్ క్యాస్ట్ కాబట్టి ఆయన నన్ను ఆదరించలేదు. ఆయన గ్రేట్. సినిమాకి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుకుంటాం.
ఇక మెగా హీరోలైన వరుణ్ తేజ్ తో సాయి ధరమ్ తేజ్ తో చేసిన సినిమాల వలన కోట్లలో నష్టపోయాను. నాగబాబు గారంటే ఇష్టం.. ఆయన కొడుకు వరుణ్ తేజ్ తో లోఫర్ సినిమా చేసి ఏడు కోట్లు నష్టపోయాను. అంతేకాదు.. వరుణ్ తేజ్ కి అంతకుముందు ఉన్న పారితోషకం కన్నా నేను వరుణ్ తేజ్ కి ఎక్కువ పారితోషకమే ఇచ్చాను. ఇక నేను నష్టపోయిన.. వాళ్ళ సైడ్ నుండి ఎలాంటి స్పందన లేదు. మరొక అవకాశం వరుణ్ తేజ్ తో వస్తుంది అని చూస్తున్నా.. అది ఇంతవరకు కుదరలేదు.
ఇక సాయి తేజ్ తో నేను ఇంటిలిజెంట్ మూవీ చేశా. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ సబ్జెక్టు ప్రేక్షకులకి ఎక్కదని ముందు నుండి చెప్పినా వినలేదు. ఆ సినిమాతో నేను కనివిని రీతిలో నా లైఫ్ లోనే ఎక్కువగా డబ్బు పోగొట్టుకున్నాను. అయినా సాయి తేజ్ రెమ్యునరేషన్ మొత్తం ఇచ్చేసాను. ఆ సినిమా పోయినందుకు వినాయక్ నా కన్నా ఎక్కువ బాధపడ్డాడు. ఒక ఏడాది పాటు మనిషి కాలేకపోయాడు. ఆ తరవాత నేనే వినాయక్ తో బాలయ్య కి సినిమా సెట్ చేశాను. అది ఇంకా కుదరలేదు.
ఇక చిరు గారితో సినిమా చెయ్యాలని ఉన్నా.. ఆయన పిలిచి అవకాశం ఇచ్చేవరకు ఆయన్ని అడగను. ఆయనకి కళ్యాణ్ తో సినిమా చెయ్యాలని ఉంది అని అనుకునేదాకా వెయిట్ చేస్తాను. ఇక రామ్ చరణ్ నాతో సినిమా చేస్తా అని చెప్పారు. కానీ ఆయనకున్న కమిట్మెంట్స్ మధ్యలో దూరలేను. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడే చరణ్ తో సినిమా ఉంటుంది అంటూ సి కళ్యాణ్ మెగా కాంపౌండ్ విభేదాలపై క్లారిటీ ఇచ్చేసాడు.