హీరోయిన్స్ కి అందం, గ్లామర్ ఎంత ముఖ్యమో వారు చేసే డైటింగ్స్, వారు చేసే వర్కౌట్స్ లోనే తెలిసిపోతుంది. గ్లామర్ గా ఉండాలంటే డైటింగ్ చెయ్యాలి, అందంగా ఉండాలంటే వర్కౌట్స్ పై శ్రద్ద పెట్టాలి ఇది హీరోయిన్స్ నిరంతర ప్రక్రియ. కాస్త బరువు పెరిగిన, మొహంలో గ్లో తగ్గినా వాళ్ళ కెరీర్ మటాష్ అనుకుంటారు. అయితే తాజాగా ఓ ప్లాప్ హీరోయిన్ అందంగా ఉండాలంటే ఏం చెయ్యాలో చెబుతుంది. టాలీవుడ్ యంగ్ హీరో శర్వా సరసన నటించి హిట్ కొట్టినా, సీనియర్ హీరోలైన రవితేజ, నాగ్ సినిమాల్లో నటించినా ఆమెకి లక్కు కలిసిరాక అవకాశాలు రాలేదు. ఆఖరికి యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో ఓటిటి మూవీలో నటించినా ఆమెకి అవకాశాలు నిల్.
మోడ్రెన్ గ గ్లామర్ గా కనిపించే సీరత్ కపూర్ అందంగా కనిపించడమనేది బయటి ప్రపంచానికి శ్రమతో కూడినట్టు కనిపించదు. కానీ దానికోసం చాల కష్టపడాలి. క్రమశిక్షణ, నిలకడగా ఉండటం, గ్లామర్ గా ఉండడానికి శ్రద్ధ వహించడం, టైం కి ప్రోటీన్స్ తీసుకోవడం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే అవసరం. లాక్ డౌన్ పెట్టకముందు వరస షూటింగ్ కారణంగా సరైన నిద్ర ఉండేది కాదు. కానీ లాక్‌డౌన్‌లో ఎక్కువసేపు నిద్రించే అవకాశం లభించింది. రోజుకి 8 గంటల నిద్రతో వచ్చే అందం ఎలాంటి మేకప్ వాడినా రాదు. నిద్ర అంత అందాన్ని, సొగసుని తీసుకుస్తుంది.. అంటూ బ్యూటీ టిప్స్ ఇస్తుంది సీరత్ కపూర్.