దేశంలో కరోనా కేసులు అంచనాలు మించి నమోదయ్యాయి. ఏప్రిల్ చివరి వారం, మే ఫస్ట్ వీక్ లో కరోనా కేసులు నాలుగు లక్షల పైమాటే నమోదయ్యాయి. దానితో దేశంలోని పలు రాష్ట్రకు లాక్ డౌన్ దిశగా ప్రయాణం చేసాయి. మే ఫస్ట్ కి ముందే మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ లో కరోనా కేసుల అధికంగా ఉండడంతో లాక్ డౌన్ పెట్టెయ్యగా మే ఫస్ట్ నుండి ఏపీ లో కర్ఫ్యూ, తెలంగాణాలో మే 10 నుండి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. రేపు 30 తో ఆంధ్ర కర్ఫ్యూ, తెలంగాణాలో లాక్ డౌన్ లు ముగిసిపొతున్నాయి.
అయితే ఆంధ్ర సీఎం జగన్ మరో 15 రోజుల పాటు ఆంధ్రలో కర్ఫ్యూ కొనసాగించాలనే నిర్ణయానికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరో 15 రోజుల పాటు ఆంధ్ర లో 18 గంటల కర్ఫ్యూని అమలు చేస్తారని, ప్రస్తుతం కర్ఫ్యులో ఎలాంటి సడలింపులైతే ఉన్నాయో.. అవే మరో 15 రోజుల పాటు అమలవుతాయని తెలుస్తుంది. సీఎం జగన్ మంత్రులతో చర్చించి ఆంధ్రలో జూన్ 15 వరకు కర్ఫ్యూ కొనసాగించే విషయంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.