కమల్ హాసన్ కూతుళ్లలో హీరోయిన్ గా శృతి హాసన్ కి వచ్చిన క్రేజు, ఫెము ఆయన రెండో కూతురు అక్షర హాసన్ కి రాలేదనే చెప్పాలి. శృతి హాసన్ ఆ మధ్యన బాయ్ ఫ్రెండ్, పెళ్లి అంటూ తిరిగి కెరీర్ ని పక్కనబెట్టింది కానీ.. లేదంటే ఈపాటికి అన్ని భాషల్లో టాప్ లో చక్రం తిప్పేది. కొన్నాళ్ళు సినిమాలకు దూరమవడం, లుక్స్ పరంగా శృతి లో అనేక మార్పులు వచ్చినా.. శృతి హాసన్ తెలుగులో క్రాక్, వకీల్ సాబ్ మూవీస్ తో పర్ఫెక్ట్ గా కం బ్యాక్ అయ్యింది. ఆ సినిమాల సక్సెస్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ సలార్ మూవీలో ప్రభాస్ తో కలిసి నటిస్తుంది.
ప్రస్తుతం లాక్ డౌన్ తో ఇంటి పట్టునే ఉంటున్న శృతి హాసన్ తన సంపాదన తానే సంపాదించుకుంటా అని, అందుకే కష్టపడుతుంటాను అని.. నిర్మాతలు ఎప్పుడు ఫోన్ చేసినా షూటింగ్ కి రెడీ అని, కరొనకి భయపడేది లేదని చెప్పింది శృతి హాసన్. అయితే శృతి తాజాగా తన చెల్లెలి అక్షర హాసన్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తానని చెప్పి షాకిచ్చింది. అంటే ఇంతవరకు అక్షర హాసన్ నటనలో ఉంది కానీ దర్శకత్వం వైపు అడుగులు వెయ్యలేదు. తన చెల్లెలు అక్షర హాసన్ కు దర్శకత్వం రంగంలో రాణించాలనే కోరిక ఉందని తెలిపింది. అక్షర దర్శకత్వం వహిస్తే తనకు సరిపడా కథ అందిస్తే తప్పకుండా అక్షర దర్శకత్వంలో నటిస్తానని తెలిపింది శృతి.