Advertisementt

మహానటి దర్శకుడి టైమ్ మిషన్ స్టోరీ

Fri 28th May 2021 08:50 PM
nag ashwin,prabhas,deepika,amithab,sci-fi thriller,prabhas-deepika padukone  మహానటి దర్శకుడి టైమ్ మిషన్ స్టోరీ
Nag Ashwin Building Time Machine for Prabhas మహానటి దర్శకుడి టైమ్ మిషన్ స్టోరీ
Advertisement
Ads by CJ

మహానటి తో అందరి చూపు తన మీదే పడేలా చేసుకోవడమే కాదు.. అవార్డుని సైతం అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్.. మహానటి ముందు నుండే ప్రభాస్ తో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నా.. మహానటి తర్వాత కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డేట్స్ నాగ్ అశ్విన్ కి దొరకలేదు. అదిగో ఇదిగో అంటూ ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమా అనుకుని ఏడాదిన్నర అయ్యింది. కానీ ప్రభాస్.. నాగ్ అశ్విన్ తో మూవీ కమిట్ అన్నాక ఆదిపురుష్ తో పాటుగా సాలార్ పాన్ ఇండియా మూవీస్ ని లైన్ పెట్టుకున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకెళ్ళినా నాగ్ అశ్విన్ ఇంకా ప్రభాస్ మూవీ స్క్రిప్ట్ పైనే ఉన్నాడు. నాగ్ అశ్విన్ - ప్రభాస్ మూవీ పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ లెవల్లో తెరకెక్కుతోందని అంటున్నారు.

భారీ బడ్జెట్ తో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ప్రభాస్ మూవీని రెడీ చేయబోతున్నాడనే హింట్స్ ఇస్తున్నారు. అంటే గతంలో బాలకృష్ణ - సింగీతం కాంబోలో తెరకెక్కిన ఆదిత్య 369 టైపు లో అన్నమాట. కాకపోతే ఇది భవిష్యత్తు సంబందించిన స్టోరీ అంటున్నారు నాగ్ అశ్విన్ వాళ్ళు. భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించి ఆ నేపథ్యంలో ప్రభాస్ తో సినిమా మొదలు పెట్టబోతున్నాడట నాగ్ అశ్విన్. అందుకోసమే సింగీతం ని ఈ సినిమా స్క్రిప్ట్ లో భాగం చేసింది అని కూడా అంటున్నారు. ఈ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కోసం సలహాలు సూచనలు ఇచ్చేందుకు సింగీతం అయితే.. ఆయనకి ఆల్రెడీ అనుభవం కూడా ఉంది కాబట్టే ఆయన్ని ఈ భారీ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. మరి నాగ్ అశ్విన్ - ప్రభాస్ ఈ టైమ్ మిషన్ కాన్సెప్ట్ తో ఎప్పుడెప్పుడు పట్టాల మీదకి వస్తారా అని ఫాన్స్ బాగా వెయిటింగ్. 

Nag Ashwin Building Time Machine for Prabhas:

Nag Ashwin sci-fi thriller with Prabhas - Deepika Padukone

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ