Advertisementt

సుశాంత్ సింగ్ కేసు లో మేనేజర్ అరెస్ట్

Fri 28th May 2021 07:06 PM
sushant singh rajput,death,ncb arrests,celebrity manager,siddharth pithani  సుశాంత్ సింగ్ కేసు లో మేనేజర్ అరెస్ట్
NCB arrests celebrity manager Siddharth Pithani సుశాంత్ సింగ్ కేసు లో మేనేజర్ అరెస్ట్
Advertisement
Ads by CJ

గత ఏడాది బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజపుట్ సూయిసైడ్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటినుండి బాలీవుడ్ స్టార్ కిడ్స్ కి నెటిజెన్స్ నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదురవుతుంది. అప్పుడు ఆ టైం లో చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాని చూడడానికి భయపడిపోయారు. అంత సెన్సేషన్ క్రియేట్ చేసిన సుశాంత్ సింగ్ రాజపుట్ కేసు విషయం తిరిగి తిరిగి అది డ్రగ్స్ కేసు కింద బాలీవుడ్ ని షేక్ చేసింది. ఆ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ లో అరెస్ట్ లు జరగడం, కొన్ని రోజులు సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి కటకటాల పాలు కూడా అయ్యింది. ఇంకా చాలామంది సెలబ్రిటీస్ ఈ డ్రగ్స్ కేసులో ఎన్ సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు.  

తాజాగా సుశాంత్ సింగ్ కేసులో ఆయన పీఆర్వో మేనేజర్ గా పనిచేసిన సిద్ధార్థ్ పితాని ని ఎన్ సీబీ అధికారులు ఈ రోజు హైదరాబాద్ లో అరెస్ట్ చెయ్యడం కలకలం రేపింది. సుశాంత్ సింగ్ తో లాస్ట్ ఫోన్ కాల్ మాట్లాడిన సిద్ధార్థ్ పితాని.. గతంలో సుశాంత్ సింగ్ ప్లాట్ లో అతనితో కలిసి మూడేళ్లు ఉన్నాడట. ఈ క్రమంలో తాజాగా సిద్ధార్థ్ ను ఎన్సీబీ అరెస్ట్ చేసి ముంబై కి తరలించారు. సిద్ధార్థ్ పితాని ని అరెస్ట్ చేశామని, త్వరలోనే అతనిని కోర్టులో హాజరు పరుస్తామని ఎన్ సీబీ అధికారులు చెబుతున్నారు. 

NCB arrests celebrity manager Siddharth Pithani:

Sushant Singh Rajput death: NCB arrests celebrity manager Siddharth Pithani

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ