గత ఏడాది కరోనా లాక్ డౌన్ లో తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు ని కుటుంబ సభ్యుల మధ్యన వివాహమాడిన కాజల్ అగర్వాల్.. పెళ్లి, హనీమూన్ ముగించేసి వెంటనే తాను నటిస్తున్న సినిమాల షూటింగ్స్ లో వాలిపోయింది. అప్పట్లో కాజల్ అగర్వాల్ హనీమూన్ కోసం మాల్దీవుల్లో భర్త తో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. భర్త తో కలిసి సీ నైట్ డిన్నర్, అండర్ వాటర్ రెస్టారెంట్ లో కాజల్ భర్త తో కలిసి రొమాంటిక్ గా ఉన్న ఫొటోస్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బీచ్ ఒడ్డున కాజల్ అల్లరి, భర్తతో కలిసి దిగిన ఫొటోస్ ని కాజల్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అలాగే సెకండ్ వేవ్ తో మరోసారి లాక్ డౌన్ మొదలవడంతో భర్తతో కలిసి గడుపుతున్న కాజల్ అగర్వాల్.. అప్పుడప్పుడపు గ్లామర్ ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ తాను సినిమాలు చెయ్యడానికి ఎప్పుడూ సిద్దమే అంటుంది. ఇక తాజాగా భర్త తో కాజల్ రొమాంటిక్ గా వయ్యారాలు పోతున్న ఫొటోస్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. కాజల్ ఆమె భర్త గౌతమ్ కిచ్లు స్టెప్స్ మీద కూర్చుని రొమాంటిక్ గా ముచ్చట్లు చెప్పుకుంటూ.. హాగ్ లతో, ముద్దులతో చిన్న గా స్మైల్ చేస్తూ.. కాజల్ తన్మయత్వంలో ఉన్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భర్త తో రొమాంటిక్ గా కాజల్ అంటూ క్యాప్షన్స్ పెట్టేస్తున్నారు ఆమె ఫాన్స్.