సీనియర్ ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీ లో కొంతమంది ఈసారి ఎన్టీఆర్ ఘాట్ సందర్శనానికి వెళ్ళలేదు. కరోనా కారణంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర తమ తండ్రి గారికి నివాళులు అర్పించలేకపోతున్నామని ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ చెప్పారు. అయితే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తన తండ్రి గారికి నివాళులు అర్పించారు. తన తండ్రి సమాధి మీద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించిన బాలకృష్ణ ఆ తర్వాత అందరితో కాస్త డిస్టెన్స్ పాటిస్తూ మీడియా తో మట్లాడారు. ఎంతోకాలంగా నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఎన్టీఆర్‌పై ఎంతోమంది పుస్తకాలు రాశారని.. ఎన్టీఆర్ పై పుస్తకాలూ అంటే.. ఆయన ఎవరికి పుట్టారు, ఎలా ఉన్నారు, ఆయన ఎక్కడెక్కడికి ప్రయాణించారు అనేది కాదని.. ఎన్టీఆర్ మూలాల్లోకి వెళ్లి అన్ని తెలుసుకుని రాసేదే పూస్తమని అన్నారాయన.
ఎన్టీఆర్ ఎప్పుడూ మనతోనే ఉంటారు. టిడిపి పార్టీని స్థాపించి ఎన్టీఆర్ పేద ప్రజల కోసమే జీవించారని, ఆయన పేదల పెన్నిధి అని, ఎన్టీఆర్ యుగపురుషుడని అని, తన తండ్రి సినిమాలు చూసి తాను స్ఫూర్తి పొందానని చెప్పారు బాలయ్య.