టాలీవుడ్ లో పూరి జగన్నాధ్ కి ఓ స్టయిల్ ఉంటుంది. ఆయనంత స్పీడు గా సినిమాలు ఎవరూ తియ్యలేరు. ఒకప్పుడు పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన పూరి జగన్నాధ్ కి ఇస్మార్ట్ శంకర్ సినిమా ముందు చాలా డిజాస్టర్స్ చవిచూడాల్సి వచ్చింది. ఇస్మార్ బ్లాక్ బస్టర్ తో పూరి మరోసారి కం బ్యాక్ అయ్యారు. పూరి జగన్నాధ్ మేకింగ్ స్టయిల్ కి బోలెడంత అభిమానులుంటే.. ఇప్పుడు ఆయన నా శత్రువు అంటూ ఓ టాప్ డైరెక్టర్ తండ్రి, ఓ టాప్ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ చెప్పడం నిజనంగా సంచలనమే. అలీ తో సరదాగా ప్రోగ్రాం లో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ని అలీ అడిగిన ప్రశ్న: రాజమౌళి తర్వాత మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అనగానే.. పూరి జగన్నాధ్. ఆయన నా శత్రువు.
పూరి అంటే నాకు అసూయ. నా శత్రువును ప్రతిరోజూ చూడాలని ఆయన ఫొటో నా ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాను అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఆయనంటే చాలా ఇష్టమని చెబుతున్నారాయన. ఇక కథలు రాయడానికి చాలామంది రైటర్స్, డైరెక్టర్స్ బ్యాంకాక్, లేదా మంచి ప్రదేశాలకి వెళతారు కదా.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా అని అలీ అడిగితే.. దానికి ఆయన పేరుకి పెద్ద రైటర్ నే కానీ.. నన్నెవరూ ఆలా తీసుకెళ్లలేదు. నాలుగు గోడల మధ్యలోనే కథలు రాసుకుంటూ ఉంటాను. ఎన్నో భారీ, బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలను అందించిన ఈయనకు సినిమాలు చూస్తే నిద్ర వస్తుందట. అంతేకాదు ఒక్కోసారి నిద్రపోవడానికి సినిమాలకు వెళుతుంటారని చెప్పి నవ్వేస్తున్నారాయన.
అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఆయన నచ్చిన విషయం .. అబద్దాలు ఆడటం. ఇక్కడ అబద్దాలు ఆడేవారికి మంచి చోటు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీకి వచ్చే వారు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాలని చెబుతున్నారు విజయేంద్ర ప్రసాద్.