ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ కొట్టి.. తర్వాత యంగ్ హీరోలతో కలిసి నటించినా అంతగా క్రేజ్ రాని మెహ్రీన్ కి అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 లో హీరోయిన్ గా కంటిన్యూ చేస్తున్నాడు. అయితే ఈమధ్యనే తాను ప్రేమించిన వాడిని పెళ్లాడడానికి రెడీ అయిన మెహ్రీన్ కౌర్ నిశ్చితార్థం కూడా చేసుకుంది. గత ఏడాది కరోనా కొంచెం తగ్గు ముఖం పట్టాక మెహ్రీన్ హర్యానాకు చెందిన కాంగ్రెస్ రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని.. పెళ్లి కి రెడీ అయ్యింది. కరోనా పరిస్థితులు చక్కబడకపోయినా.. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యనే పెళ్లి జరుగుతుంది అని చెప్పింది మెహ్రీన్.
అయితే తాజాగా మెహ్రీన్ కౌర్ పెళ్లి పోస్ట్ పోన్ అయినట్లుగా.. కరోనా సెకండ్ వేవ్ సిట్యువేషన్ లో పెళ్లి చేసుకోవడం మంచిది కాదని అందుకే పెళ్లి ని వాయిదా వేస్తున్నట్లుగా చెప్పిన మెహ్రీన్ ప్రస్తుతం పెళ్లి విషయాలను పక్కనబెట్టి పని పై దృష్టి పెడతా అంటుంది. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత అన్ని అనుకూలించాకే పెళ్లి విషయం ఆలోచిస్తామని చెబుతుంది. అయితే మెహ్రీన్ కి కుటుంబ సభ్యులకి మార్చి లో ఆమె నిశ్చితార్థం అవ్వగానే కరోనా బారిన పడి కోలుకున్నారని.. మళ్ళీ పెళ్లి విషయంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకే ఇలా పెళ్లిని వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది.