రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు పెను సంచలనమే సృష్టించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టు, రేవంత్, స్టీఫెన్ సన్ సంభాషించినట్టు కాల్ రికార్డులు బయటకి రాగా తెలంగాణ ఏసీబీ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు - రేవంత్ రెడ్డి పై వచ్చిన ఆరోపణల్లో భాగంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై ఛార్జ్ షీటు నమోదు చెయ్యడం, ఓటుకి నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలు కి వెళ్లడం తర్వాత కొన్ని కారణాలతో అయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరడం, చంద్రబాబు కూడా తెలంగాణ లో టిడిపిని పక్కనబెట్టేసి కేవలం ఏపీకే పరిమితమైపోవడం చూసాం.
గత ఎన్నికల్లో జగన్ చేతికి ఈ ఓటుకు నోటు కేసు అస్త్రంగా మారింది. ఆ ఎన్నికల్లో చంద్ర బాబు ఓడిపోయినా.. ఆ ఓటుకు నోటు కేసు మాత్రం చంద్ర బాబుని బాగా ఇబ్బంది పెట్టింది,
అయితే ఈ కేసులో చంద్రబాబుకు తాజాగా ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఈరోజు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రేవంత్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ, నిందితుడిగా మాత్రం ఈడీ చంద్ర బాబు పేరుని మాత్రం పేర్కొనలేదు. దానితో చంద్రబాబుకు ఊరట లభించినట్టయింది. ఇక ఈ ఓటుకు నోటు కేసు నుండి చంద్రబాబు బయట పడినట్లే.