కార్తీ - లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కిన ఖైదీ మూవీ అటు తమిళంలోనే కాదు ఇటు తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. పోలీస్ లు, ఖైదీ, డ్రగ్ మాఫియా, తండ్రి - కూతురు కలయిక, స్టూడెంట్స్ పోలీస్ లకి హెల్ప్ చెయ్యడం అన్ని ఖైదీ సినిమాలో అద్భుతంగా చూపించారు. కార్తీ ఖైదీ గా పోలీస్ టీం ని సేవ్ చెయ్యడం, అలాగే డ్రగ్ మాఫియా ఆట కట్టించడం, కూతురు కోసం కార్తీ పడే ఆవేదన, పోలీస్ ఆఫీసర్ కి కార్తీకి మధ్యన సాగే ఎమోషన్ సన్నివేశాలు అన్ని.. సినిమాలో పాటలు లేకపోయినా సినిమాని హిట్ చేసాయి. ఖైదీ లో కార్తీ నటన మెయిన్ హైలెట్. అంతేకాదు ఖైదీ సినిమా క్లైమాక్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అయితే ఆ సినిమా ఇంకా ఎండ్ అవలేదు. దానికి సీక్వెల్ ఉంటుంది అని ఆ సినిమా రిలీజ్ టైం లో చెప్పిన దర్శకుడు లోకేష్ హీరో కార్తీ మధ్యలో ఆ సినిమా విషయాలను మాట్లాడడం మానేశారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఖైదీ సీక్వెల్ కోసం బాగా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు.
ఖైదీ సీక్వెల్ అన్నప్పటికీ దర్శకుడు వేరే సినిమాలు చేసుకోవడం, కార్తీ కూడా ఇతర సినిమాలతో బిజీ కావడంతో ఇక ఖైదీ సీక్వెల్ లేకపోవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అటు కార్తీ ఇటు లోకేష్ లు కూడా ఖైదీ సీక్వెల్ పై పెదవి విప్పడం లేదు. కానీ రీసెంట్ గా ఖైదీ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు మాట్లాడుతూ ఖైదీ సినిమాకి సీక్వెల్ ఉందని స్పష్టం చేశాడు. ఖైదీ సీక్వెల్ స్రిప్ట్ రెడీ అవుతుంది అని, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని, లోకేష్ కనకరాజ్ విక్రమ్ ని, కార్తీ సర్దార్ మూవీని పూర్తి చేసాక ఖైదీ సీక్వెల్ పట్టాలెక్కుతోంది అని చెప్పారు.