ఏపీ ప్రభుత్వం జూన్ 7 నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ 10 పరీక్షలను నిర్వహిస్తామని, కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ.. పరీక్షల నిర్వహణ చేపడతామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ నిన్నటివరకు చెబుతూ వచ్చారు. కరోనా సెకండ్ ఉధృతిలో ఎలాగైనా పరీక్షల నిర్వహణ చేపడతామని మంత్రి ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టి చెబుతుంటే ఏపీ పేరెంట్స్, స్టూడెంట్స్ లో ఆందోళన అంతకంతకు ఎక్కువైపోయింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం 10 పరీక్షలను పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ప్రకటించింది ప్రభుత్వం. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న కారణముగా 10 పరీక్షలను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు.
జులై లో మరోసారి చర్చించి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని, ఇంటర్, 10th విద్యార్థుల భవిష్యత్తుకి అతి ముఖ్యమైన పరీక్షలు కాబట్టి అవి నిర్వహిస్తామని, విద్యార్థుల భవిష్యత్తు దృష్యా పరీక్షల నిర్వహణ చేపట్టామని, అన్ని అనుకూలించాక పరీక్షల తేదీ చెబుతామంటూ ప్రకటించారు ఆదిమూలపు. ప్రతి పక్షాలు పరిస్థితిని అర్ధం చేసుకోకుండా గోల చేస్తున్నాయని, పరీక్షలని రద్దు చెయ్యడం అంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుంది అని, కానీ లోకేష్ మాత్రం 10, ఇంటర్ పరీక్షల రద్దుకు నానా హంగామా చేస్తున్నాడంటూ ఆదిమూలపు సురేష్ లోకేష్ పై విరుచుకుపడ్డారు.
ఇక ఈరోజు వరకు కరోనా టైం లో పరీక్షలు ఎలా రాయాలో అనే టెంక్షన్ లో ఉన్న విద్యార్థులు.. మళ్ళీ ఎప్పుడు పరీక్షలు పెడతారో తెలియని అయోయమయంలో ఉండిపోయారు.