Advertisementt

ఫస్ట్ విజయ్ దేవరకొండ .. సెకండ్ బన్నీ

Mon 31st May 2021 05:55 PM
allu arjun,hits 12 million,followers,instagram vijay devewrakonda,south india stars  ఫస్ట్ విజయ్ దేవరకొండ .. సెకండ్ బన్నీ
First Vijay Deverakonda - Second bunny ఫస్ట్ విజయ్ దేవరకొండ .. సెకండ్ బన్నీ
Advertisement
Ads by CJ

ఇప్పుడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్స్ అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ ఇద్దరూ కాస్ట్యూమ్స్ లో, లుక్స్ విషయంలో పోటీ పడుతున్నారు. విజయ్ దేవరకొండ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే రౌడీ స్టార్ గా అభిమానులను సొంతం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్స్ కి అల్లు అర్జున్ ఫిదా అవుతుంటాడు. అలాంటి స్టార్స్ ఇప్పుడు నువ్వా - నేనా అని సోషల్ మీడియాలో పోటీ పడుతున్నారు.

ఎప్పుడో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా అభిమానులని సంపాదించుకున్నాడు. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా మారిపోయి.. అలా వైకుంఠపురములో సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యడమే కాదు.. ఫస్ట్ టైం పుష్ప మూవీ తో పాన్ ఇండియా లోకి అడుగుపెడుతున్నారు. అయితే అల్లు అర్జున్ కి బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. అక్కడ మంచి పీఆర్ టీం ని బన్నీ మెయింటింగ్ చేస్తుంటాడని టాక్ ఉంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కొత్తగా సోషల్ మీడియాలో ఓ రికార్డు సృష్టించాడు. అది సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ఫాలోవర్స్ సంఖ్య 12 మిలియన్స్ దాటింది. తెలుగుతో పాటు సౌతిండియాలో ఈ రికార్డు అందుకున్న రెండో హీరోగా నిలిచాడు బన్నీ.

ఫస్ట్ ప్లేస్ ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొట్టేసాడు. ఈమధ్యనే విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ఇన్స్టా లో 12 మిలియన్ వ్యూస్‌తో తొలిసారి ఈ ఫీట్ అందుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ ఇన్నాళ్ళకి 12 మిలియన్స్ ఫాలోవర్స్ సంఖ్య తో సెకండ్ ప్లేస్ లోకి వచ్చాడు. మరి అటు పుష్ప తో బన్నీ, ఇటు లైగర్ తో విజయ్ దేవరకొండ ఒకేసారి పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నారు. అప్పుడు వీళ్ళ రేంజ్ ఎలా ఉంటుందో చూడాలి.

First Vijay Deverakonda - Second bunny :

Allu Arjun hits 12 million followers on Instagram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ