Advertisementt

ఆర్.ఆర్.ఆర్ డీల్: ఇండియా నెంబర్ 1

Wed 26th May 2021 08:20 PM
rrr,charan,jr ntr,rajamouli,zee5 and netflix,massive business,star maa,star tamil asianet,malayalam and star kannada  ఆర్.ఆర్.ఆర్ డీల్: ఇండియా నెంబర్ 1
Big Announcement on Digital, Satellite Rights ఆర్.ఆర్.ఆర్ డీల్: ఇండియా నెంబర్ 1
Advertisement
Ads by CJ

రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ బిజినెస్ లెక్కలు చూస్తే కళ్ళు తిరగడం ఖాయం. బాహుబలితో ఇండియా ని చుట్టేయడం అటుంచి ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి మ్యానియాని పరిచయం చేసిన రాజమౌళి నెక్స్ట్ ఆర్.ఆర్.ఆర్ పై మార్కెట్ లో ఉన్న బజ్ చూస్తే ఔరా అని అనకమానరు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కోసం ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ అంతా కూడా జరిగిపోయింది. ఇప్పుడు శాటిలైట్, డిజిటల్ రైట్స్ అంటూ ఆర్.ఆర్.ఆర్ లెక్కలు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మేస్తున్నాయి. ఇండియా వైడ్ గా ఆర్.ఆర్.ఆర్ ని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఆర్ఆర్ఆర్ మూవీని పెన్ మూవీస్ విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. దాని కోసం భారీ డీల్ కూడా జరిగింది.

తాజాగా విదేశీ భాషల్లోనూ ఆర్ఆర్ఆర్‌ను విడుదల చేసేందుకు పెన్ మూవీస్ సంస్థ సిద్దమైంది. పోస్ట్‌ థియేట్రికల్‌(థియేటర్‌లో విడుదల తర్వాత) డిజిటల్‌, శాటిలైట్‌ ప్రసార హక్కులను పెన్‌ స్టూడియోస్‌ దక్కించుకుంది. ఇండియాలో భారీ డీల్ ఆర్.ఆర్.ఆర్ దే అంటూ పెన్ మూవీస్ వారు ట్వీట్ చేసారు. డిజిటల్ స్ట్రీమింగ్‌లో భాగంగా ఆర్.ఆర్.ఆర్ మూవీ ని జీ5 (తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ), నెట్ ఫ్లిక్స్ (హిందీ, ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, టర్కీష్, స్పానీష్) శాటిలైట్ పార్ట్నర్ (జీ సినిమా-హిందీ, స్టార్ మా-తెలుగు, స్టార్ విజయ్-తమిళం, ఏసియా నెట్-మళయాలం, స్టార్ సువర్ణ-కన్నడ)లో విడుదల చేయబోతన్నట్టు అధికారికంగా ప్రకటించారు.

రాజమౌళి సినిమా ఆర్.ఆర్.ఆర్ ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఇంత గొప్ప అవకాశం దక్కినందుకు రాజమౌళి కి నిర్మాత దానయ్యకు థాంక్స్ చెప్పుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ కి మార్కెట్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందొ ఈ డీల్ ఒక ఉదాహరణ అని చెప్పొచ్చేమో. విడుదలకు ముందే ఇన్నిన్ని రికార్డులని కొల్లగొడుతున్న ఆర్.ఆర్.ఆర్ విడుదలైన తర్వాత ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ పండగ చేసేసుకుంటున్నారు.

Big Announcement on Digital, Satellite Rights:

RRR Massive Announcement

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ