కీర్తి సురేష్ మహానటి తర్వాత వరస ప్లాప్స్ తో అల్లాడిపోయింది. సర్కార్, పందెం కోడి ఇలా వరస ప్లాప్స్ తర్వాత విమెన్ సెంట్రిక్ మూవీస్ తోనూ హిట్ కొట్టలేకపోయింది. పెంగ్విన్, మిస్ ఇండియా తో నిరాశ పరిచిన కీర్తి సురేష్ కి మరో పక్క లుక్ పై ట్రోల్స్. కీర్తి సురేష్ వెయిట్ లాస్ అవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఫాన్స్ మే లుక్స్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లుక్స్ పరంగా ట్రోలింగ్ ఎదుర్కుంటున్న కీర్తి సురేష్ కి టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ సర్కారు వారి పాటలో ఛాన్స్ ఇవ్వడంతో మరోసారి స్టార్స్ దృష్టి కీర్తి సురేష్ పై పడింది.
అయితే కీర్తి సురేష్ కి కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చింది అని, అది కూడా స్టార్ హీరో విజయ్ తెలుగులో వంశి పైడిపల్లితో చెయ్యబోయే మూవీలో విజయ్ సరసన కీర్తి సురేష్ ని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో వంశి పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఉంది. అది పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తారని, ఆ సినిమా కోసం కీర్తి సురేష్ ని సంప్రదిస్తున్నారని అంటున్నారు. విజయ్ తో ఆల్రెడీ కీర్తి సర్కార్ మూవీలో నటించింది. ఇప్పుడు మరోసారి విజయ్ సినిమాలో కీర్తి సురేష్ కన్ఫర్మ్ అయితే కీర్తి రేంజ్ పాన్ ఇండియా లెవల్ కి పెరిగిపోతుంది అని అంటున్నారు.