గత కొన్నేళ్లుగా హిట్ అన్నదే లేని కళ్యాణ్ రామ్ కి 118, ఎంత మంచి వాడవురా సినిమాలు హిట్ అవడంతో కళ్యాణ్ రామ్ మర్కెట్ పెరిగింది. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రావణ్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ గురించిన అప్ డేట్స్ లేవు. ఇక పెద్ద ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ ని రివీల్ చెయ్యబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ కొత్త సినిమా #NRK18 టైటిల్ ని ఎల్లుండి అంటే శుక్రవారం మే 28 న సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి రోజున మధ్యాన్నం 12 గంటలకి రివీల్ చెయ్యబోతున్నట్టుగా చెబుతున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో #NRK18 పవర్ ఫుల్ టైటిల్ ని రివీల్ చెయ్యబోతున్నట్టుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్ నుండి అప్ డేట్ రావడంతో నందమూరి ఫాన్స్ ఆనందం మాములుగా లేదు. ఎందుకంటే అదే రోజున ఉదయం 8.45 కి ఎన్ బీకే ఫిలిమ్స్ నుండి స్మాల్ సర్ప్రైజ్ అంటూ అప్ డేట్ రావడంతో ఒకే రోజు ఇద్దరి నందమూరి హీరోల కొత్త సినిమాల అప్ డేట్స్ వస్తున్నాయని ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.