ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్, ఫేమ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఆల్మోస్ట్ పాన్ ఇండియా మూవీస్ ని మాత్రమే ఓకె చేస్తున్నాడు. సాహో తో దెబ్బతిన్న ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ లు తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాస్తా.. హాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు.. హాలీవుడ్ లో తెరకెక్కనున్న మిషన్ ఇంపాజిబుల్ సరికొత్త పార్ట్ లో ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడంటూ ప్రచారం జోరుగా మొదలైంది. పలు జాతీయ వార్తా పత్రికల్లో ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ పై.. ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ పై పలు రకాల కథనాలు ప్రచురిస్తున్నారు. అయితే ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ పై ఓ నెటిజెన్ ఆసక్తి ఆపుకోలేక మిషన్ ఇంపాజిబుల్ చిత్ర దర్శకుడు క్రిస్టోఫర్‌కి ట్వీట్ చేశాడు.
హలో సర్ మీరు హాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న మిషన్ ఇంపాజిబుల్-7 లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కీ రోల్ పోషించనున్నారంటూ.. ప్రచారం జరుగుతుంది. దయచేసి అందులో ఎంత నిజముందో చెప్పగలరు.. అంటూ ట్వీట్ చెయ్యగా.. దానికి క్రిస్టోఫర్ ప్రభాస్ ఎంతో టాలెంట్ కలిగిన వ్యక్తి. కానీ ఇప్పటి వరకూ ఆయన్ని నేను కలవలేదు.. (While he‘s a very talented man, we’ve never met.)అంటూ ట్వీట్ కి రిప్లై ఇవ్వడంతో ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ జరుగుతున్న రచ్చ కి ఫుల్ స్టాప్ పడిపోయింది. లేదంటే నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో పాటుగా ప్రభాస్ హాలీవుడ్ కి వెళ్ళిపోతున్నాడనే అనుకుంటున్నారు అంతా..