సాయి పల్లవి - ఫహద్ ఫాజిల్ మలయాళంలో నటించిన అథిరన్ మూవీ తెలుగులో అనుకోని అతిథిగా రేపు శుక్రవారం ఆహా ఓటిటి ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమా కి సంబందించిన పబ్లిసిటీని టీం గట్టిగ చేస్తుంది. సాయి పల్లవి క్రేజ్ తో సినిమాపై మంచి హైప్ కూడా వచ్చింది. అయితే అనుకోని అతిధి నిర్మాత అనుకోకుండా ఈరోజు గుండెపోటుతో మరణించడం అందరిని కలిచి వేసింది. అనుకోని అతిధి నిర్మాత అన్నం రెడ్డి కృష్ణ కుమార్ మరణించారు.
ఆయనకి నిన్న రాత్రి నుండి గుండె నొప్పి తో ఇబ్బంది పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు 26 ఉదయం గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తీసుకెళ్ళే లోపు అప్పటికే అన్నం రెడ్డి కృష్ణ కుమార్ మరణించారని తెలుస్తుంది. ఒక పక్క సినిమా రిలీజ్ ఏర్పట్లలో ఆయన కాస్త బిజీగా వుంటున్నారని.. అందుకే ఒత్తిడిలో ఉన్నారని కుటుంబ సభ్యులు భావించారట. కానీ ఆయనకి గుండె పోటు అధికంగా రావడంతో కన్నుమూశారని చెబుతున్నారు. రేపు శుక్రవారం విడుదల కాబోతున్న సినిమా నిర్మాత ఇలా రెండుకి రోజు ముందే కన్నుముయ్యడంతో చిత్ర బృందం కన్నీటి పర్యంతమవుతుంది. ఆయన మరణ వార్తతో సినిమా ఇండస్ట్రీ అంతా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.