Advertisementt

రేపు నందమూరి ఫాన్స్ కి చిన్న సర్ప్రైజ్

Wed 26th May 2021 11:03 AM
balayya fans,surprise from akhanda,nandamuri fans,bb3,balakrishna,boyapati,akhanda movie  రేపు నందమూరి ఫాన్స్ కి చిన్న సర్ప్రైజ్
A Small Surprise for Nandamuri Fans రేపు నందమూరి ఫాన్స్ కి చిన్న సర్ప్రైజ్
Advertisement
Ads by CJ

అన్నీ అనుకూలకంగా ఉండి ఉంటే రేపు శుక్రవారం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. బోయపాటి - బాలకృష్ణ కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా రాబోతున్న BB3 అఖండ మూవీ పై మార్కెట్ లో భారీ బజ్ ఉంది. అఖండ టీజర్ యూట్యూబ్ రికార్డులని కొల్లగొట్టడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. బాలయ్య గత ప్లాప్స్ ని, బోయపాటి వినయ విధేయరామ ప్లాప్ ని కూడా ప్రేక్షకులు మరిచిపోయి అఖండ రిలీజ్ కోసం వెయిట్ చేసేలా చేసింది అఖండ టీజర్. మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

కానీ కరోనా సెకండ్ వెవ్ ఉగ్ర రూపంతో అఖండ వాయిదా అనివార్యమైనప్పటికీ.. అఖండ నుండి ఫస్ట్ సింగిల్ సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి రోజున రాబోతుంది అని ప్రచారం జరుగుతున్నవేళ.. రేపు ఉదయం 8.45 కి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లుగా.. ఎన్ బీకే  ఫిలిమ్స్ వారు సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే అది అఖండ సర్ప్రైజ్ అని ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ప్రకటన చూసిన ఫాన్స్.. అఖండ నుండి స్మాల్ సర్ప్రైజ్ అయ్యుంటుంది అంటూ నందమూరి ఫాన్స్ లో అటెంక్షన్ క్రియేట్ అవుతుంది. అఖండ రిలీజ్ లేట్ అయినా.. అఖండ నుండి సర్ ప్రైజ్ అనేసరికి నందమూరి ఫాన్స్ లో ఉత్సాహం పెరిగిపోతుంది.

అది అఖండ ట్రీటా లేదంటే.. బాలయ్య మరేదన్న కొత్త మూవీ అనౌన్సమెంటో తెలియడం లేదు. మరి రేపు ఉదయం వరకు ఆ టెంక్షన్ తట్టుకోవడం కష్టం అంటున్నారు ఫాన్స్.

A Small Surprise for Nandamuri Fans:

Balayya fans get ready, Another surprise from Akhanda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ