Advertisementt

నేను బావున్నాను.. అవన్నీ రూమర్స్

Tue 25th May 2021 04:37 PM
chandra mohan,gives clarity,health condition,acting career  నేను బావున్నాను.. అవన్నీ రూమర్స్
Chandra Mohan Gives Clarity About His Health Condition నేను బావున్నాను.. అవన్నీ రూమర్స్
Advertisement
Ads by CJ

పాత తరం నటుల్లో ఇప్పటికి చాలా ఆరోగ్యంగా పలు సినిమాల్లో చిన్న చితక కేరెక్టర్ చేస్తూ నవ్వుతూ నవ్వించే చంద్ర మోహన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకి విషెస్ చెబుతూ ఆయన ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి చాలామంది చంద్ర మోహన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.. ఆయన ఆరోగ్యం బాగోలేదు అంటూ ప్రచారం చేసారు. అలాగే ప్రస్తుతం కరోనా పరిస్థితులు.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సినిమాలు చేయనని చెప్పారు చంద్ర మోహన్. అయితే చంద్ర మోహన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై చంద్రమోహన్ స్వయంగా స్పందిస్తూ..ఓ వీడియో పోస్ట్ చేసారు.

తనకి ఆరోగ్యం బాగోలేదంటూ ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అని.. తనకు ఆరోగ్యం బాగోలేదని వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని .. తన ఇంట్లోనే సంతోషంగా ఉన్నాను అని, తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. అందరి అభిమానమే తనకు శ్రీరామ రక్ష అంటూ అయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు చంద్ర మోహన్ వీడియో ద్వారా చెక్ పెట్టారు. తనపై ఇలాంటి న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్న వారిని శిక్షించాలని ఆయన కోరుతున్నారు.

Chandra Mohan Gives Clarity About His Health Condition:

Actor Chandra Mohan puts an end to his acting career

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ