బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ మూవీ మరో మూడురోజుల్లో రిలీజ్ కావల్సి ఉంది. కానీ థియేటర్స్ బంద్, కరోనా కష్ట కాలంతో అఖండ మూవీ వాయిదా పడిపోయినట్లే అని అందరికి తెలుసు. కానీ అఖండ యూనిట్ మాత్రం అఖండ రిలీజ్ పోస్ట్ చేసినట్లుగా ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. మరో మూడు రోజులల్లో అంటే మే 28 న అఖండ అంటూ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసినా.. ప్రస్తుతం పరిస్థితిల్లో సినిమాని పోస్ట్ పోన్ చేస్తామని కానీ, లేదంటే మరేమైనా కానీ చెప్పకుండా అభిమానులని సస్పెన్స్ లో పెడుతున్నారు. అందరూ అఖండ అనుకున్న డేట్ కి రాకపోయినా.. ఆ రిలీజ్ డేట్ కి ఫస్ట్ సింగిల్ ఇస్తారంటున్నారు.
ఇప్పటికే అఖండ రెండు టీజర్స్ రికార్డులని సృష్టించగా.. సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. మరి మే 28 సినిమా రిలీజ్ డేట్ కి అఖండ సింగిల్ అయినా వదులుతారో? లేదంటే ఇలాంటి కన్ఫ్యూషన్ కొనసాగిస్తారా? అంటూ నందమూరి ఫాన్స్ బోయపాటికి రిక్వెస్ట్ లు పెడుతున్నారు. సినిమా విడుదల కానీ పరిస్థితుల్లో సినిమాని వాయిదా వేస్తున్నామని చెబితే బావుంటుంది కదా అనేది నందమూరి ఫాన్స్ అభిప్రాయం.