Advertisementt

కెజిఫ్ 2 నుండి రావు రమేష్ కి సర్ప్రైజ్

Mon 31st May 2021 09:49 AM
prashanth neel,yash,kgf 2,rao ramesh,rao ramesh kgf look,prashanth neel kgf  కెజిఫ్ 2 నుండి రావు రమేష్ కి సర్ప్రైజ్
Rao Ramesh role from KGF Chapter 2 కెజిఫ్ 2 నుండి రావు రమేష్ కి సర్ప్రైజ్
Advertisement
Ads by CJ

ప్రశాంత్ నీల్ - యశ్ కాంబోలో తెరకెక్కిన కెజిఎఫ్ అన్ని భాషల్లోనూ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టి పాన్ ఇండియా ఫిలిం గా రికార్డులు సృషించింది. దానితో ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2 ని పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే 2 టీజర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది. యశ్ ఎలివేషన్ సీన్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేసాయి. ఈ సినిమా పక్కా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. అయితే యశ్ లుక్, అందులోని కొన్ని లుక్స్ ని టీజర్ ద్వారా రిలీజ్ చేసిన టీం.. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రావు రమేష్ లుక్ ని రివీల్ చేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

కెజిఎఫ్ చాప్టర్ 2 లో రావు రమేష్ కన్నెగంటి రాఘవన్ పాత్రకు సంబంధించిన పోస్టర్ ని ఆయన బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసి చిత్రం యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇందులో రావు రమేష సీబీఐ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇంకా ఈ సినిమాలో అధీరా గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపిస్తున్నాడు. ఎప్పుడో విడుదలైన అధీరా లుక్ కి అద్భుతమైన స్పందన రాగా.. కెజిఎఫ్ చాప్టర్ 2 జులై 16 నే విడుదల చేస్తామన్నట్లుగా టీం మరోసారి రావు రమేష్ బర్త్ డే రోజున కంఫర్మ్ చేసింది.

Rao Ramesh role from KGF Chapter 2 :

Rao Ramesh KGF look shared by Prashanth Neel

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ