Advertisementt

మెగా హీరో సినిమాని రిజెక్ట్ చేసి బేబమ్మ

Tue 25th May 2021 01:09 PM
kriti shetty,uppena,bebamma,sai dharam tej,nani,sudheer babu new movie,ram new movie,abhiram daggubati  మెగా హీరో సినిమాని రిజెక్ట్ చేసి బేబమ్మ
Kriti Shetty rejects mega hero మెగా హీరో సినిమాని రిజెక్ట్ చేసి బేబమ్మ
Advertisement
Ads by CJ

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా భీభత్సమైన క్రేజ్, ఫేమ్ సంపాదించుకున్న బేబమ్మ కృతి శెట్టి.. ఆ సినిమాతో యంగ్ హీరోల దృష్టిలో పడడమే కాదు.. ఒకే ఒక్క సినిమా కెరీర్ నే మార్చేసినట్టుగా కృతి శెట్టి కి ఏకంగా మూడు సినిమాల ఆఫర్స్ క్యూ కట్టాయి. నాని, సుధీర్ బాబు, రామ్ ప్రాజెక్ట్స్ కి ఇప్పటికే సైన్ చేసిన కృతి శెట్టి కి ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఈ మూడు ప్రాజెక్ట్స్ అయ్యాకే తాను మరో సినిమా చేస్తా అని చెబుతుంది. ఉప్పెన సినిమాలో బేబమ్మగా వైష్ణవ తేజ్ తో అదిరిపోయే లవ్ ట్రాక్ నడపగా... అది ఫ్రెష్ గా ఉండడంతో ఆ పెయిర్ కి మంచి క్రేజ్ వచ్చింది.

అయితే కృతి శెట్టి ఖాళీగా ఉన్న సమయంలో ఫుల్ గా తినేసి నిద్రపోవడం అంటే ఇష్టమట. అంతేకాదు.. తన లైఫ్ లోకి రాబోయే వ్యక్తి అంటే తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అస్సలు అబద్దాలు చెప్పకూడదు. దాపరికం లేకుండా ముక్కుసూటిగా ఉండే వ్యక్తి తన జీవితంలోకి వస్తే బావుంటుంది అంటూ చెప్పి షాకిచ్చింది బేబమ్మ. షాకివ్వడం అంటే జస్ట్ 17 ఏళ్లకే ఉప్పెన సినిమాలో నటించి.. 18 ఏళ్లకే ముగ్గురు యంగ్ హీరోలతో జోడి కట్టిన కృతి శెట్టి అప్పుడే పెళ్లి పై తన అభిప్రాయాలను తెలియజెయ్యడం షాక్ కాక ఇంకేమవుతుంది. 

మరోపక్క కృతి శెట్టి మెగా హీరో సినిమాని రిజెక్ట్ చేసింది అని అంటున్నారు. సాయి ధరమ్ తేజ్ - కొత్త డైరెక్టర్ కార్తీక్ కాంబో సినిమా కోసం కృతి శెట్టి ని సంప్రదించగా.. తాను నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్, రామ్ మూవీ, సుధీర్ బాబు మూవీ ఫినిష్ అయ్యాక ఆలోచిస్తా అని చెప్పిందట. ఇప్పటికే బెల్లంకొండ డెబ్యూ మూవీని కృతి శెట్టి రిజెక్ట్ చేసినట్లుగా న్యూస్ ఉంది.

Kriti Shetty rejects mega hero:

Kriti Shetty shocks Sai Dharam Tej?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ