Advertisementt

బోయపాటికి ఎవరు దొరుకుతారో

Tue 25th May 2021 12:08 PM
boyapati srinu,ravi teja,allu arjun,pan-indian film,bb3,akhanda movie,balakrishna  బోయపాటికి ఎవరు దొరుకుతారో
Boyapati Srinu and Ravi Teja film loading? బోయపాటికి ఎవరు దొరుకుతారో
Advertisement
Ads by CJ

పవర్ ఫుల్ మాస్ డైరెక్టర్ కాస్త రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయరామ తో కామెడీ డైరెక్టర్ అయ్యాడు బోయపాటి. అప్పటివరకు బోయపాటి తో సినిమాలు చేయాలనుకునే హీరోలంతా ఒక్క దెబ్బకి పారిపోయారు. బోయపాటి రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయరామ అంతటి కళాఖండం. ఆ తర్వాత బోయపాటికి బాలకృష్ణ దొరకడానికి చాలా టైం పట్టేసింది. బోయపాటి తో సినిమా ఓకే అన్న బాలయ్య దాదాపు రెండేళ్లు బోయపాటిని వెయిట్ చేయించాడు. అయినా బోయపాటి బాలకృష్ణ తో హ్యాట్రిక్ కొట్టి మరోసారి తనని తాను నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యి రెండేళ్లు బాలయ్య కోసం ఓపిగ్గా నిరక్షించాడు. బోయపాటి - బాలకృష్ణ BB3 మొదలయిన రెండునెలలకే BB3 నుండి టీజర్ ని వదిలి సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పంచేసారు. అప్పటికే వారి కాంబోలో సింహ, లెజెండ్ లాంటి హిట్స్ ఉండడంతో.. ఈ BB3 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తర్వాత రీసెంట్ గా అఖండ టీజర్ తో మరోసారి అంచనాలు అమాంతం పెంచేసిన బోయపాటి - బాలయ్యలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే హింట్ ఇచ్చేసారు. దానితో ఇప్పుడు మరోసారి స్టార్ హీరోల నోట బోయపాటి పేరు వినిపిస్తుంది. సక్సెస్ వెంటే స్టార్ పడిపోతారు అనేది టాలీవుడ్ లో ఉన్న టాక్. అయితే బోయపాటి అఖండ తర్వాత రవితేజ తో అయినా, అల్లు అర్జున్ తో అయినా సినిమా చేసే అవకాశం ఉంది అంటున్నారు. అల్లు అర్జున్ - బోయపాటి సరైనోడు బన్నీ ని మాస్ హీరోగా నిలబెట్టింది. ఇక రవితేజ భద్ర తో బోయపాటి దర్శకుడిగా తిరుగులేని ఎంట్రీ ఇచ్చాడు. మరి అల్లు అర్జున్ పుష్ప మూవీతో ఓ ఏడాది పాటు బిజీ. రవితేజకి రెండు మూడు కమిట్మెంట్స్ ఉన్నాయి. అఖండ తర్వాత ఇమ్మిడియట్ గా బోయపాటికి రవితేజ దొరుకుతాడో? లేదంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ఛాన్స్ ఇస్తాడో? చూడాలి.

Boyapati Srinu and Ravi Teja film loading?:

Allu Arjun, Boyapati Srinu to reunite for a pan-Indian film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ