కొరియోగ్రాఫేర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభుదేవా తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి లాంటి సినిమాలతో డైరెక్టర్ గా మారడమే కాదు.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్ని డైరెక్ట్ చేస్తున్నాడు ఆయన. అయితే ప్రభుదేవా తెలుగులో చేసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా మంచి హిట్ అవడంతో ప్రభుదేవాతో ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు పౌర్ణమి సినిమా చెయ్యగా.. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ప్రభాస్ - త్రిష - ఛార్మిలతో తెరకెక్కిన ఆ సినిమాని ప్రేక్షకులు ఆదరించలేదు. ఆ సినిమా ప్లాప్ అవడంతో ఎంఎస్ రాజుకి ప్రభుదేవాకి మధ్యన గొడవలు అయినట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి.
ఆయితే తాజాగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. పౌర్ణమి సినిమా ప్రభుదేవా తో చేశాను. ఆ సినిమా ప్లాప్ అవడంతో.. నాకు ప్రభుదేవాకి మధ్యన గొడవలైనట్లుగా వార్తలొచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. నేను ప్రభుదేవా ఇప్పటికి ఆత్మీయంగానే ఉంటామని చెబుతున్నాడు ఆయన. మరి ఎంఎస్ రాజు అంటే మహేష్ ఒక్కడు, ప్రభాస్ వర్షం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ గుర్తుకువస్తాయి. బాహుబలితో పాన్ ఇండియా హిట్ కొట్టినా ప్రభాస్ ఇప్పటికి తనకిష్టమైన మూవీ వర్షమని చెబుతుంటాడు. అంటే వర్షం ప్రభాస్ కి అంతలాంటి హిట్ ఇచ్చిందన్నమాట.